మనదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 300 కు పైగా పెరగడంతో వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొన్ని కఠినమైన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు దేశం మొత్తాన్ని స్వీయ గృహనిర్బంధనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గృహనిర్బంధం ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

 

ఒక రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో రెండు విధించాల్సి వస్తుందని తెలిపింది. అలాగే నిబంధనలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని తెలిపింది.

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, "ప్రజలు గృహ నిర్బంధాన్ని పాటించకపోతే ... కఠినమైన చట్ట నియమాలను పాటించేలా రాష్ట్ర్రాలకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.  ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండటానికి, సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం అని అధికారి తెలిపారు.

 

విధంగా నిబంధనలను పాటించకపోతే అంటువ్యాధులు చట్టంలోని సెక్షన్ 10, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం 6 నెలల జైలుశిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీని కింద పర్యవేక్షణలో ఉన్న కరుణ వైరస్ సోకిన వారు క్వారంటైన్ వార్డు నుంచి పారిపోయినా మరియు స్వీయ నిర్బంధన ను అతిక్రమించి బయటికి వెళ్లి వారి వ్యాపారాలు చూసుకున్నా.... సోషల్ దూరం పాటించకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

 

అలాగే వ్యాపారాలు గలవారు రోజు వారి షాపులను తెరిస్తే దాదాపు పది వేల రూపాయల నుండి జరిమానా విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కరోనా వైరస్ పై పోరాటానికి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లూవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో అన్నారు.  ఏదైనా  సందేహం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1075 కాల్ చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: