జనతా కర్ఫ్యూ.. ఈ సంఘటన దేశం యొక్క ఐక్యతను చాటుతోంది... అవును.. కొన్ని రకాల పరిస్థితులు అధికార, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెస్తాయి. దానికి ఉదాహరణే.. ఈ జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు అందరూ ఇందులో పాల్గొనాలని కోరారు. 

 

ఆ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రియతమ నేత ప్రియాంకా గాంధీ సైతం... కరోనా వైరస్‌పై పోరాటానికి నడుం బిగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన హ్యాండ్ వాష్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె... కరోనా వైరస్ రాకుండా చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో వీడియో మెసేజ్ ద్వారా పేర్కొన్నారు. చేతుల్ని ఇలా మాటి మాటికీ.. ముమ్మాటికీ సబ్బుతో క్లీన్ చేసుకుంటే... కరోనా వైరస్ సోకే అవకాశమే లేదన్నారు.. ప్రముఖ కాంగ్రెస్ అభినేత్రి... ప్రియాంకాగాంధీ. 

 

 

మనం చేసిన చిన్న చిన్న పనులే.. కరోనా వైరస్‌ను అడ్డుకోగలవని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. తగిన  జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌తో పోరాడగలం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం విశేషత సంతరించుకుంది. ఇళ్లలోనే ఉంటూ... ఎప్పటికప్పుడు కరోనా వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హ్యాండ్ వాష్ ఛాలెంజ్ ప్రపంచమంతా ఇపుడు విస్తరించింది. చాలా మంది ప్రముఖులు... చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తూ... వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.

 

ఇక్కడ మనం గుర్తించ వలసినది ఏమంటే, చేతుల్ని శుభ్రం చేసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలా బడితే అలా శుభ్రం చేసుకుంటే.. ఉపయోగం ఉండదు. ఎక్కడో.. ఏ మూలనో... ఒక చోట వైరస్ ఉండిపోయే అవకాశం మెండుగా ఉంటుంది. అందుకే చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ రకాలుగా సూచించింది. ప్రపంచం ప్రమాదపు అంచున వున్న వేళ... ఆయా సూచనలను తూ.చ పాటిస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: