చాలా విడ్డురంగా జరిగింది ఈ చోరీ. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. సర్దిన సామాన్లు యధావిధిగానే ఉన్నాయి. అసలు దొంగతనం జరిగినట్టే బయటకి కనిపించలేదు. మరి ఇలా చోరీ జరిగింది అంటే నిజంగా షాకింగ్... అది కూడా పోలీసు ఇంట్లోనే. ఈ చోరీ ముంబాయి లో జరిగింది. నిగ్ది పోలీస్ స్టేషన్ పరిధి లో బాధిత సీఐ జవాధ్వాన్ పని చేస్తున్నాడు. అయితే అతను పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు.

 

ఇది కాకుండా అతనికి మరో ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే చోరీ జరిగింది. మార్చి 7 నుండి 15 వ తేదీల మధ్యలో ఈ చోరీ జరిగిదేమోనన్న అనుమానం. అయితే అక్కడ దొంగ తనం జరిగి రూ. 4.20 లక్షల బంగారు నగలని దోచుకెళ్లారు. అయితే ఈ నగలు బీరువా లో పెట్టలేదు జవాధ్వాద్ భార్య. వాటిని ఆమె కబోర్డ్ లో పెట్టింది. దొంగలు కబోర్డ్ లో ఉన్న నగలని చూసి వాటిని పట్టుకెళ్లారు. ఆ పోలీసు హదప్సర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసాడు

 

అయితే ఈ చోరీని చేస్తున్నప్పుడు వాళ్ళు తలుపుని  డూప్లికేట్ తాళంతో తీసారట. అలానే బీరువా తాళాన్ని కూడా డమ్మీ తాళంతోనే ఓపెన్ చేశారట. ఎక్కడ కూడా ఏమి బద్దలుకొట్టకుండా జాగ్రత్తగా ఎత్తుకెళ్లారు. అయితే సీఐ తన ఇంటికి వచ్చినప్పుడు తలుపు తాళం ఊడిపోయి ఉండడం తో అనుమానం వచ్చిందట. మొక్కలకి నీళ్లు పోయడానికి నియమించిన ఆ వాచ్ మ్యాన్ ని అడిగితే ఏమి తెలియదని బదులిచ్చాడు.

 

అయితే ఎప్పుడు వాచ్ మ్యాన్ దగ్గర మరో సెట్ కీస్ ఉంటాయట. కానీ తాను తాళాలు ఎవరికీ ఇవ్వలేదు. దొంగతనం గురించి తెలియదు అంటూ చెప్పాడు. అయితే ఈ కరోనా వాళ్ళ బిజీగా ఉన్న పోలీసులు ఈ సమస్యని కొద్దీ రోజుల తర్వాత చూస్తామన్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: