ఇప్పుడు దేశం మొత్తం ఒక పేరు చెబితే గడగడ లాడిపోతుంది. అదే కరోనా వైరస్. ఆ వైరస్ దేశాల్ని మొత్తం చుట్టపెట్టి మన భారత దేశంలోకి కూడా వచ్చేసింది. దాని ప్రభావితంతో దేశం మొత్తం అల్లకల్లోలంలా మారిపోయింది. ఏ వైరస్ తాకిడిని ఆదిలోనే  చంపేయాలని మన దేశ  ప్రధాన మంత్రి  జనతా కర్ఫ్యూ అనే ఒక విన్నూత ఆలోచన చేసారు. అయితే జనతా కర్ఫ్యూ జరుగుతున్న వేళ కోవిడ్ 19 మరొక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య క్రమ  క్రమంగా  పెరుగుతూనే ఉంటుంది.

 

 

ఆ చనిపోయిన వ్యక్తి  ముంబైలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ కరోనా  63 ఏళ్ల ఓ ముసలాయన  కి సోకింది.ఆ ముసలాయన ఆయాసం తో మార్చి 19న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మార్చి 21న రాత్రి 11.03 గంటలకు మరణించినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా తెలిపింది. మృతుడికి ఆల్రెడీ డయాబెటిస్ ఉందనీ, హైబీపీ కూడా ఉందని తెలిపింది. అలాగే గుండెకు ఇస్కెమిక్ వ్యాధి కూడా ఉందని వివరించింది. దానితో పాటు ఆయాసం కూడా తోడయింది.  

 

 

ఇన్ని వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు కరోనా వైరస్ సోకిందనీ, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోయారని తెలిపింది. వయస్సు ఎక్కువ కావడం, దానికి తోడు శరీరంలో ఇమ్మ్యూనిటి శక్తీ కూడా తగ్గిపోవడంతో కరోనా వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపింది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అయి ఆ ముసలాయన చనిపోయాడట.  దేశం మొత్తం జనతా కర్ఫ్యూలో పాల్గొన్న సమయంలో... కరోనా కేసుల సంఖ్య 327కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 52 మందికి వైరస్ సోకింది. ఢిల్లీలో 27, యూపీలో 26, రాజస్థాన్‌లో 23 మందికి వైరస్ ఉంది.ఈ వైరస్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 

 

 

పంజాబ్ అప్రమత్తమై పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు పంజాబ్‌లో ఈ లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అలాగే మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ లో కూడా పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. కరోనా రాకుండా వ్యక్తిగత శుభ్రత ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: