వామ్మో వామ్మో.. ఈ కరోనా వైరస్ మనుషులను బతకానిచ్చేలా లేదు... బ్రహ్మం గారు చెప్పినట్టు కోటిమందిని తీసుకెళ్లాలా ఉంది... మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.. భయం కల్గిస్తున్నాం అని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం. అయినా మిమ్మల్ని ఎంత భయపెట్టిన ఎం ప్రయోజనంలే మీరు ఏమైనా బయపడి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కునే వార? ప్రయాణాలు తగ్గించేవారా? 

 

IHG

 

ఒక్క 14 గంటలు ఇంట్లోనే ఉండండి రా సామీ అంటే ఒక్కడైనా మాట వింటున్నాడా? ఒక్కడైనా భయపడుతున్నాడా ? వింటున్నారు లెండి.. అది వేరే విషయం.. కానీ కొందరికి మాత్రం అస్సలు భయం లేదు.. ఇంకా తిరుగుతూనే ఉన్నారు.. బయట తిరుగుతూనే ఉన్నారు.. ఒక్క 14 గంటలు ఓపిక పట్టండి సామీ అని అన్న కూడా వినడం లేదు.. 

 

IHG

 

మేము ఇంతే.. మమ్మల్ని ఎవరు మార్చలేరు అని తిరుగుతున్నారు.. మీకు జైల్లో వేసి ఫైన్ వేస్తాం అని పోలీసులు కూడా ఉన్నారు అనుకోండి అది వేరే విషయం. ఇంకా వీరి గురించి మాట్లాడటం ఆపితే.. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ఇప్పటికే కొన్ని వేలమందిని పొట్టనపెట్టుకుంది.. 

 

IHG

 

కొన్ని లక్షలమందిని ఆస్పత్రులకు పరిమితం చేసింది. అలాంటి ఈ కరోనా వైరస్ ఈరోజుకు ఎంతమందికి సోకిందో తెలిస్తే షాక్ అయిపోతారు.. సరిగ్గా ఈరోజుకు ఇప్పటికి 341 మందికి కరోనా వైరస్ సోకింది. 6 మంది మరణించారు. ఆదివారానికి అంటే ఈరోజు 341 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇరాన్ కంటే మన దేశంలో కరోనా అత్యంత వేగంగానే వ్యాపిస్తుంది. అందుకే ఈ ఒక్క రోజు బయటకు రాకండి స్వామి.. జాగ్రత్తగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: