కరోనా వైరస్ వణికిస్తోంది . జనాల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ కి పిలుపుని ఇచ్చిన సంగతి తెలిసినదే. అయితే ఒకే రోజు రెండు మరణాలు చోటు చేసుకోవడం బాధాకరం. అయితే బీహార్ కి రాజధాని అయిన పాట్నా లో కరోనా వైరస్ కారణం వల్లనే చనిపోయినట్లు తెలిసింది.

 

 

అయితే అతనికి 38 ఏళ్ళుట. అయితే కిడ్నీ ఇంతకు ముందే కిడ్నీ ఫెయిలైంది అట . అయితే ఈ వివరాలు చూస్తే మాంగెర్ కి చెందిన వ్యక్తి . ఇతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇతను రెండు రోజులు క్రితమే కలకత్తా నుండి పాట్నా వచ్చాడట. అప్పుడు ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడట. తానూ నిన్న ప్రాణాలు కరోనా వల్ల కోల్పోయినట్టు డాక్టర్లు చెబుతున్నారు. 

 

 

కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాదు . మరో వ్యక్తి కూడా కరోనా వైరస్ కారంగా తన ఆఖరి శ్వాసని విడిచి వెళ్ళిపోయాడు. ముంబాయి కి చెందిన 63 ఏళ్ళ ఒక ముసలాయన కూడా చనిపోయాడు. ముంబాయి ఆసుపత్రి లో 19 వ తేదీన జాయిన్ చేసారు. ఆల్రడీ ఆ వ్యక్తికి డయాబెటిస్ మాత్రమే కాక హైబీపీ, గుండెకి ఇస్కెమిక్ ఉండడం చేత ఉపిరికి ఇబ్బందై కరోనా వైరస్ తో మృతి చెందాడు.

 

 

ఇలా ఒకే రోజు రెండు మరణాలు చోటు చేసుకోవడం నిజమ్గా బాధాకరం.అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడం ప్రారంభం అయ్యాయి . ఇప్పటికే 341 కేసులు మన భారత దేశం లో నమోదు అవ్వడం బాధాకరమే. ఇప్పటికే రాజస్థాన్ లో లాక్ డౌన్ చేసేసారట. త్వరలో మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: