పెద్దలు చెప్పేవారు.. ఏమని అంటే మన పాతకాలం పద్దతులు పాటిస్తూ, ఉన్నంతలో జీవించమని.. కాని మనిషి ఊరుకుంటాడా.. ఎంతైనా కోతి నుండి వచ్చాడు కదా.. ఎవరి మాట వినడు.. ఇదిగో ఇలాగే ఇప్పుడు కరోనాను పుట్టించాడు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటు ఎలా ఉందంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది.. అంతే కాదు ఒక్కడికి వచ్చిన కరోనాను ప్రసాదంలా అందరికి పంచుతున్నాడు..

 

 

ఎలాగంటే కరోనా వచ్చిన బాధితుడు ఒక్కసారి తుమ్మినా, దగ్గినా కోటానుకోట్ల వైరస్‌లు పరిసరాల్లోని ఉపరితలాలపై చేరిపోతాయి. చేతిని అడ్డం పెట్టుకుని ఉంటే ఆ చేతులతో తాకిన ప్రతిచోటా వైరస్‌ ఉండిపోతుంది. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్న వైరస్‌ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయట.. కాగా ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్‌ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది.

 

 

ఇకపోతే కరోనా వైరస్ సోకిన బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతని నుండి వచ్చే చిన్నచిన్న తుంపరలుగా బయటకు వచ్చే వైరస్‌లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఇదే కాకుండా మరచిపోయి షేక్‌హ్యాండ్‌ ఇస్తే ఆ వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్‌లు ఉండగా అవి ఇవతలి వారికి సోకి షేక్‌హ్యాండ్‌ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా...

 

 

ఇక గొంతులో మిగిలిపోయిన కొన్ని వైరస్‌లు లాలాజలపు చుక్కలతో కలిసి ఊపిరితిత్తుల్లోని ఒక కొమ్మపై చేరిపోతాయి. వెచ్చగా, తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇకపోతే కోవిడ్‌ బాధితుడి ఒక టీస్పూన్‌ లాలాజలంలో ఉండే కరోనా వైరస్‌ల సంఖ్య అక్షరాలా.. యాభై వేల కోట్లు ఉంటాయట.. ఇవి అంటుకుంటే సామాన్యంగా వదలవట.. అందుకే కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: