ప్ర‌పంచాన్ని ఒణికిస్తున్న కరోనా వైర‌స్ నుంచి ఎవ‌రిని వారే కాపాడుకోవ‌డాన్ని మించిన మార్గం లేదు. అందు కే మ‌న దేశంలో ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ పేరుతో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అన్నింటినీ బంద్ చేయాల‌ని, ప్ర‌జ‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి ఎక్క‌డా సంచ‌రించ‌రాద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూ చించాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఒక‌ర‌కంగా మూత‌బ‌డ్డాయి. అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు మిన‌హా ఏవీ కూడా ప‌నిచేయ‌డం లేదు. అయితే, ఉద‌యం 7కు ముందు, రాత్రి 9 త‌ర్వాత ఎందుకు జాగ్ర‌త్త‌లు తీసు కోలేదు? అనే ప్ర‌శ్న స‌ర్వ‌సాధార‌ణ‌మే. దీనికి స‌మాధాన‌మే ఈ స్టోరీ..! ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ మొత్తం 14 గంట‌ల పాటు జ‌ర‌గ‌నుంది

.

దీని వెనుక చాలా స్టోరీనే ఉంద‌ని అంటున్నారు వైద్యులు. ఉద‌యం 7 గంట‌ల‌లోపు భారీ ఎత్తున జ‌న‌సంచా రం ఉండ‌దు. అదేవిధంగా రాత్రి 9 త‌ర్వాత కూడా ఎక్క‌డి ప్ర‌జ‌లు అక్క‌డే నిలిచిపోతారు. అంటే మొత్తంగా ఉద‌యం 7 నుంచి రాత్రి 9 మధ్యే రాష్ట్రాల్లో జ‌న‌సంచారం ఉంటుంది. దీనిని క‌ట్ట‌డి చేయాలంటే.. ప్ర‌భుత్వా ల‌కు త‌ల‌కుమించిన ప‌ని.. ఈ నేప‌థ్యంలో వారి బాధ్య‌త‌ను వారికి గుర్తు చేయ‌డం ద్వారా జ‌న‌తా క‌ర్ఫ్యూను తెర‌మీదికి తెచ్చారు. ఇక‌, 14 గంట‌ల క‌ర్ఫ్యూ వెనుక కూడా పెద్ద ర‌హ‌స్యం ఇమిడి ఉంది.  గాల్లో ఉండే కరోనా వైరస్‌ జీవితకాలం 12 గంటలు. ఈ కాలంలో దీన్ని ఎవ్వరూ ముట్టుకోకుంటే అక్కడికక్కడే చనిపోతుంది

.

అంటే ఓ 14 గంటల పాటు ప్రజలు ఇళ్లల్లో ఉండిపోవడం వల్ల కరోనా వైరస్‌ దానికదే నశిస్తుంది. అందుకే ఆదివారం 14 గంటలపాటు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వా లు, అధికారులు ఆదేశాలు జారీచేశారు. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ త‌నంత‌ట త‌ను అంతం అయ్యేందుకు 12 గంట‌ల స‌మ‌యం చాలు. అయితే, మ‌రో రెండు గంట‌లు అద‌నంగా వెచ్చించ‌డం అనేది ముందు జాగ్ర‌త్త‌లో భాగ‌మేన‌ని అంటున్నారు నిపుణులు. మిత్తానికి వైర‌స్ విష‌యంలో మందుల క‌న్నా.. మౌనం.. ద‌గ్గ‌ర క‌న్నా దూర‌మే బెస్ట్‌! అని వైద్యులు, నిపుణులు సైతం సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: