హైదరాబాద్ నగరంలోకి ఏ ఏ ప్రాంతాల వారు ప్రవేశిస్తున్నారో తెలిసుకొలేని పరిస్థితి తెలంగాణ అధికారులకు పెద్ద తల నొప్పిగా మారిందని సీఎం కెసిఆర్ శనివారం నాడు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. విదేశీయులు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి క్వారంటైన్ కేంద్రంలోకి రాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా వైరస్ అనుమానితులు కూడా ఢిల్లీ, ముంబాయి లాంటి నగరాల నుండి హైదరాబాద్ వచ్చే ట్రైన్ లలో ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తున్నారు. దీంతో వైరస్ సోకని మిగతా ప్రజలకు ప్రమాదం రోజురోజుకీ తీవ్రంగా పెరిగిపోతుంది.




తాజాగా ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి ఆ ప్రాంతం అంతట అనుమానాస్పదంగా సంచరిస్తుండగా... కొంత మంది ప్రజలు అతని చేతి పై వేసిన ముద్ర ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు హుటాహుటిన అనుమానితుడి కోసం వెతికి ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆరా తీయగా... మహారాష్ట్ర ప్రభుత్వం తనని కరోనా వైరస్ అనుమానితుడిగా నిర్ధారించి తన ఎడమ చేతి పై ఒక ముద్రవేసి 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళమని చెప్పారని తెలిపాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన పోలీసులు వెంటనే డాక్టర్లకి సమాచారం అందించి అతన్ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు.




కొంచెం కూడా సామాజిక బాధ్యత లేకుండా ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇతర ప్రజలకు కూడా కరోనా సోకే ప్రమాదముంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిక సోకితే వారు వెంటనే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే కరోనా అనుమానితులు కాస్త సమాజం గురించి ఆలోచించి ఇతర ప్రజల శ్రేయస్కరం కోసమేనా స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం మంచిదని అందరూ చెబుతున్నారు. ఒకవేళ కరోనా అనుమానితులు ఇలాంటి పనులను చైనా దేశంలో చేస్తే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా ఇండియా లోని స్వేచ్చని అందరి మంచి కోసం ఉపయోగించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇకపోతే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72 కి చేరుకోగా ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: