దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రతరం అవుతున్న వేళ భారత దేశంలో రోజురోజుకు ప్రజలు భయాందోళనలు చెందుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ... రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ఇక ఈ వైరస్కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రజల్లో మరింత ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే ఈ వైరస్ ను  భారత్ నుండి తరిమి కొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ఆలోచన చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ  నిర్వహించాలని.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను తరిమి కొట్టాలంటూ  దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. 

 

 

 దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. పల్లెలు పట్టణాలు అన్ని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ని  నిబద్ధతతో పాటిస్తున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎక్కడ ఒక్క మనిషి కూడా బయట కనిపించడం లేదు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే జనతా కర్ఫ్యూ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా రంగ ప్రముఖులు కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ కరోనా  మహమ్మారి తో ఈరోజు నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే అక్కడక్కడా కొంతమంది ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడొచ్చిన జనతా కర్ఫ్యూ లో ఎవరు పాల్గొనకూడదు అంటూ ప్రచారాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా 34 వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ సమీ జనతా కర్ఫ్యూ లో  పాల్గొనకూడదు అంటూ  సోషల్ మీడియాలో ప్రచారం  చేశారు. అందరూ రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు 34 వ వార్డు కౌన్సిలర్. దీంతో కౌన్సిలర్ పై స్థానికులు అందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జనతా కర్ఫ్యూ కి  వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కౌన్సిలర్ మొహమ్మద్ సమీ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: