దేశంలో కరోనా మహమ్మారి ఎలా ప్రబలి పోతుందో తెలిసిందే.  ఈ నేపథ్యంలో నేడు దేశ వ్యాప్తంగా నేడు ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్న విషయం తెలిసిందే.  కరోనా ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని అంటున్నారు.  ఈ రోజు ప్రతి ఒక్కరూ ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తూ ఇంటి పట్టునే ఉంటున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి అన్ని జాగ్రత్త చర్యలు చేస్తున్నారు.  ఇక కరోనా సోకిన వారు ఇంటి పట్టున ఉండాలని క్వారంటైన్‌ పద్నాలుగు రోజులైన ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అనుమానితుల చేతులపై స్టాంపులు వేస్తోన్న విషయం తెలిసిందే. కానీ కొంత మంది మూర్ఖంగా ప్రవర్తి బయటకు వెళ్లి తిరుగుతున్నారు.

 

మరికొంత మంది చికిత్సకు బయపడి పారిపోతున్నారు.  తాజాగా సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు కలకలం సృష్టించాడు. చేతిపై హోం క్వారంటైన్‌ స్టాంపుతో తిరుగుతున్న ఓ యువకుడిని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు.  మొదట ఆ యువకుడిని ప్రశ్నించగా చిత్ర విచిత్రమైన సమాధానాలు ఇస్తూ పోలీసులను తప్పదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు.  అయితే అతని చేతిపై ముద్ర ఉండటంతో పోలీసులు కన్ఫామ్ చేసుకున్నారు.   అతడు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు.

 

అయితే, అతడు జనాల మధ్య తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇటీవల నైజీరియా, లాగోస్‌ నుంచి అబుదాబీ మీదుగా విమానంలో ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మద్య నలుగురు యువకులు సైతం ఇలా ముద్ర వేయించుకున్నప్పటికీ బయట తిరిగి.. రైల్ ప్రయాణం చేయడానికి ప్రయత్నించారు.. కానీ సహ ప్రయాణీకులు వారిని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని తర్వాత స్టేషన్ లో దింపి ఆసుపత్రికి తరలించారు.  కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉంటేనే దాన్ని అరికట్టగలమని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: