దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి వైరస్ ప్రస్తుతం భారత ప్రజలను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఇక ఈ వైరస్ కు  సరైన విరుగుడు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు మరింతగా బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా ఈ వైరస్ సోకిన వెంటనే ఎలాంటి ప్రభావం చూపకుండా కొన్ని రోజుల వరకు సాధారణ పరిస్థితి ఉండడంతో... ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వైరస్ సోకిందేమో అని ప్రాణ భయంతో బతికేస్తున్నారు.. రోజురోజుకు జనాలలో ప్రాణభయం పాతుకు  పోతుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కీలక  నిర్ణయాలు తీసుకుని కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అయినప్పయికి కరోనా ప్రభావం  మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. 

 

 

ఈ నేపథ్యంలో భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ తీవ్రత ఎక్కువవుతుంది అన్న  విషయం తెలిసిందే. దీంతో పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు... కఠిన నిబంధనలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.కరోనా ను  కట్టడి చేసేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మూవీ పిలుపునిచ్చిన జనత  కర్ఫ్యూను తూచా తప్పకుండా అన్ని రాష్ట్రాలు స్వీయ దిగ్బంధం  లోకి వెళ్లి పోయాయి. దేశం  మొత్తం ఉదయం 7 గంటల నుంచి ఎక్కడ మనిషన్నవాడు కనిపించకుండా పోయాడు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి . పల్లెలు పట్టణాలు నిశ్శబ్దం గా మారిపోయాయి. 

 

 

 అయితే దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వైరస్ రోజు  రోజుకు పెరుగుతున్న తరుణంలో స్వీయ  దిగ్బంధంలో కి అడుగులు వేస్తున్నాయి. పంజాబ్, రాజస్థాన్, పుదుచ్చేరి లో  కరోనా విజృంభణ నేపథ్యంలో  ప్రజలందరూ స్వీయ దిగ్బంధాన్ని  పాటించాలి అని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక తాజాగా ఈ జాబితాలో మరో రాష్ట్రం వచ్చి చేరింది. ఒరిస్సా లో కూడా మార్చి 29 రాత్రి 9 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేవలం రాష్ట్రంలో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు బంద్ అవుతాయని వెల్లడించింది ఒరిస్సా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: