అన్ని దేశాలను కరోనా కబళించేసింది. ప్రపంచం మొత్తం కరోనాతో కల్లోలకంగా మారింది. జనాభా పరంగా చూసుకుంటే ఏ దేశంపై ఎంత ప్రభావం చూపిస్తోంది...? 

 

భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఫిబ్రవరిలో మొదటి కేసు నమోదైతే... మార్చి మూడో వారం వచ్చేసరికి వందల్లోకి చేరింది. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దేశంలో స్టేజ్ 2లోనే ఉందని...కేంద్రం చెబుతోంది. మూడో దశకు చేరుకుంటే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్టే.... ప్రస్తుతం దేశ జనాభా సుమారుగా 130 కోట్లు... ఇందులో ఇప్పటి వరకు నమోదైన కేసులు 330 లోపే. ఇందులో 39 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా చనిపోయింది నలుగురు మాత్రమే.  

 

130 కోట్ల జనాభాలో 330 లోపు కేసులుంటే...చాలాచాలా తక్కువనే చెప్పాలి..మొత్తం జనాభాలో  0.000025 శాతం కేసులు నమోదైనట్టు...అతి తక్కువ శాతమే ఉన్నా..ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయపెడుతున్న తీరు... భారత్‌లోనూ ఆందోళనలకు కారణమవుతోంది.

 

ఇక మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ విషయానికొస్తే... పాక్ జనాభా సుమారుగా 20 కోట్లు. ఇప్పటి వరకు 640 మంది పాకిస్థాన్‌లో కరోనాతో బాధపడుతున్నారు. అంటే పాక్ జనాభాలో 0.000032 శాతం ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ.. సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 250 మందికి పైగా కరోనా వైరస్‌ సోకి బాధపడుతున్నారు. ఆ తర్వాత పంజాబ్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లలో కరోనా బాధితుల సంఖ్య వంద దాటింది. గిల్గిట్‌, ఖైబర్‌ ప్రావిన్స్‌లలో కూడా వైరస్‌ సోకిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. 

 

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎక్కువగా ప్రభావితం చేసిన దేశాల్లో ఇరాన్ ఐదో స్థానంలో ఉంది. ఇరాన్‌లో మొత్తం జనాభా 8 కోట్ల 29 లక్షలు .. అందులో 20 వేల 6వందల మందికి ఈ వైరస్‌ సోకింది. 15వందల 56 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మొత్తం జనాభాలో 0.025 శాతం 
మందికి వైరస్‌ వ్యాపించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: