దేశంలో కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశ ప్రజలందరూ కరుణ వైరస్ను అరికట్టేందుకు భాగం కావాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ పై  నిశ్శబ్ద యుద్ధం జనతా కర్ఫ్యూ కు  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు జనతా కర్ఫ్యూ  పాటిస్తూ కేవలం ఇంటికే పరిమితమై పోయారు. హాయిగా కుటుంబంతో గడుపుతూనే మరోవైపు కనిపించని శత్రువు కరోనా వైరస్ ను  తరిమికొడుతూన్నారు. దీంతో ఎక్కడ మనిషి అనే వాడు కనిపించకుండా పోయాడు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 

 

 దీంతో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన జనతా కర్ఫ్యూ  విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు అధికారిక కార్యక్రమాలకు ఏది పెట్టుకోకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంకా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో... ఇంట్లోనే హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సైతం ఇంటికే పరిమితమై.. జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. కరోనా  వైరస్ నివారణ లో ఒక భాగం అవుతున్నారు. 

 

 ఈ క్రమంలోనే టిడిపి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు జనతా కర్ఫ్యూ పాటిద్దామని  అందరూ ఇంట్లోనే ఉందాము అంటే కార్యకర్తలందరికీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక జనతా కర్ఫ్యూ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాయిగా ఇంట్లో మనవడితో కాలం గడుపుతున్నారు. మనవడు దేవాన్ష్ పుస్తకాన్ని చేతపట్టి.. దేవాన్ష్ కు పాఠాన్ని చదివి వినిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇంగ్లీష్ లో ఉన్న పాఠాన్ని చదివి వినిపించి దాని అర్థాన్ని కూడా మనవడు దేవాన్ష్ కు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కరోనా ను  నియంత్రించడానికి అందరూ ఇంట్లోనే ఉండాలని కుటుంబంతో సమయం గడపాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: