కనిపించకుండా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటూ అందరిని ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు దేశం మొత్తం ప్రస్తుతం నిశ్శబ్ద యుద్ధం  చేస్తున్న విషయం తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీ జీవితంలోని ఒకరోజు నాకు ఇవ్వండి మీకు ఎదురైన సమస్యలు తరిమికొడదాం అంటూ జనతా కర్ఫ్యూ కి  పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా మారిపోయింది. కనుచూపుమేరలో మనిషి మాత్రం కనిపించడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ  పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

 

 అయితే కరోనా వైరస్ పై యుద్ధానికి సూచికగా యావత్ భారతదేశం జనతా కర్ఫ్యూ  పాటిస్తోంది. కేవలం ఏవైనా అత్యవసర పనులుంటే తప్ప మిగతా ఏ సమయంలో కూడా దేశ ప్రజలందరూ ఇంటి గడప దాటి కాలు బయట పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ  విజయవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. పల్లెలు పట్టణాలు అనే నిర్మానుష్యంగా నే కనిపిస్తున్నాయి. ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా జనతా కలిపి విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా జనతా కర్ఫ్యూను విజయవంతంగా పూర్తి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. 

 


 కూడలిల  దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. జనం రోడ్లపైకి రాకుండా చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎవరైనా జనం రోడ్లపైకి వస్తే... వారిని తిరిగి ఇంటికి పంపించి వేస్తున్నారు. ఇక కొంతమంది పోలీసులు అయితే చేతులు జోడించి మరీ.. ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ ప్రయాణికులను బతిమిలాడుతున్నారు. ఇక ఇలాంటి దృశ్యాలు కాస్త కెమెరా కంటికి చిక్కటం తో... సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . దీంతో జనతా కర్ఫ్యూ పాటించేందుకు హైదరాబాద్ పోలీసులు ఎంతో డెడికేషన్ చూపిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: