ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్నా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు ఇంకా అదుపులోకి రావటం లేదు. ముఖ్యంగా ఢిల్లీలోని షాహిన్‌ బాగ్ ప్రాంతంలో అల్లర్లు అడపాదడపా చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలోనూ అక్కడ మాత్రం అరచాక పరిస్థితులే కనిపించాయి.

 

దేశవ్యాప్తంగా ప్రజలంతా స్వయంగా  కర్ఫ్యూ పాల్గొంటున్న వేళ.. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ఒక్కసారిగా పెట్రోల్ బాంబు కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 9.30గంటల ప్రాంతంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు షాహీన్‌బాగ్‌లోని సీఏఏ వ్యతిరేక ఆందోళన శిబిరం వద్ద ఈ బాంబు పేలినట్టుగా తెలుస్తోంది.  ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లపై పెట్రోల్ బాంబు విసిరారు దుండగులు. తరువాత కొద్ది సేపటికే 5కి.మీ దూరంలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సమీపంలోనూ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరి పారిపోయాడు.

 

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ను పరిశీలించిన అధికారులు బైక్‌ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పెట్రోల్‌ బాంబు వేసినట్టుగా గుర్తించారు. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో సీఏఏ కు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి.

 

ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆందోళనలు కొనసాగించాలా వద్దా అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఆందోళన కారులు నిరసనలు కొనసాగించేందుకు మొగ్గు చూపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలను రక్షించాలనుకుంటే.. జనతా కర్ఫ్యూ కన్నా ముందు సీఏఏ,ఎన్ఆర్‌సీ,ఎన్‌పీఆర్‌లను ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: