అనుకుంటున్న ప్రమాదం ముంచుకోస్తుంది.. ఏదైతే జరగవద్దని ఇంత కాలం అనుకుంటున్నారో ఇప్పుడు అదే జరగబోతుంది.. ప్రజలంత అ రోగాల బారిన పడి పిట్టల్లా రాలిపోయే సమయం వచ్చింది.. ఒక రకంగా ఇన్నాళ్లు జీవించింది ఒకెత్తు కాగా ఇప్పుడు జీవిస్తున్న బ్రతుకు ఒకెత్తు.. మన అన్నవాళ్లను ఎంత మంది ఆప్తులను ఇప్పుడు కోల్పోవలసి వస్తుందో తెలియడం లేదు.. ప్రపంచానికంతా చుట్టుకుంటున్న కరోనా దాహం ఇంతలో తీరే దారి కనిపించడం లేదు..

 

 

ఈ విషయంలో అధికారులు అద్దాలమేడల్లో కూర్చోని సలహాలిస్తే సరిపోదంటున్నారు.. కఠినమైన చర్యలు పాటిస్తూ, ప్రజల జీవన విధానానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన విధంగా స్పందించాలని కోరుకుంటున్నారు.. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలు ఆకలి చావులు చావకుండా, అలాగే కరోనా వ్యాప్తి జరగకుండా రక్షణ చర్యలు చేపడుతూ, ప్రతిక్షణం తన పర్యవేక్షణలో రాష్ట్రాన్ని గమనిస్తూ ఉండాలి.. ఇకపోతే కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేరళ అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్ల ప్యాకేజీని తాజాగా ప్రకటించింది.

 

 

ప్రస్తుతం కేరళ తీసుకున్న ఈ నిర్ణయానికి యావత్ ఇండియా ఆశ్చర్యపోతోంది. కరోనా రక్షణ చర్యలో భాగంగా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లను అందించేందుకు ఇటీవల రోబోలను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. ఇప్పుడు కేరళలోని వివిధ బస్సులు, బస్టాపుల్లో శానిటైజర్లను అందుబాటులోకి తెచ్చింది. బస్సు ఎక్కిన, దిగిన ప్రతి ప్రయాణికుడు తమ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తోంది. అలాగే కొన్ని బస్టాప్‌లో హ్యాండ్ వాష్‌ సదుపాయం కల్పించింది. తాత్కాలికంగా వాష్ బేసిన్లు ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులు బస్సు దిగగానే అక్కడికి వెళ్లి తమ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు.

 

 

ఇకపోతే బ్రేక్ ది చైన్ నినాదంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న ఈ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఒక యూజర్ కేరళ పరిస్దితులను అక్కడి నివారణ చర్యలను ఆన్నీంటిని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.. కాగా ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.. ఇకపోతే కోజికోడ్ జిల్లాలోని నాన్మాండ ప్రజలు బస్సు దిగిన వెంటనే చేతులు కడుక్కుంటున్న దృష్యాలు కూడా చూడవచ్చు.. ఇక కేరళ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మన ప్రభుత్వాలకూ ఉంటే ఎంత బాగుంటుందో కదూ అంటూ వివిధ రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తున్నారట..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: