పసిపిల్లల్లో జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వారిలో కడుపు నొప్పి రావడం చాలా సర్వసాధారణం. మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం ఏమరుపాటుగా ప్రవర్తించినా వారికి కడుపు నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నవజాత తల్లులు తమ పిల్లలకు ఏ ఆహారాన్ని పెడుతున్నారో వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పిల్లల్ని దుమ్ము ధూళిలో ఆడ నివ్వకుండా ఎల్లప్పుడు వారిని పరిరక్షించాలి. నోటిలో వేలు పెట్టుకున్నా పిల్లల జీర్ణ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. ఫలితంగా వారికి కడుపు నొప్పి వస్తుంది. వారికి ఒకసారి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే భీకరంగా ఏడుస్తారు. వాళ్ళని శాంతి పరచడం అంత సులువైన పని కాదు. వారి నొప్పిని తగ్గించడం కూడా తల్లులకు పెద్ద సమస్య అవుతుంది.





పిల్లలకి ముఖ్యంగా కడుపు నొప్పి రావడానికి... నాసిరకమైన పాలు పట్టించడం, ఘన పదార్థాలు తినిపించడం, సరైన సమయంలో పాలు పట్టించుకోకపోవడం లాంటివి కారణం కావచ్చు. అలాగే దుమ్ముపై చేతులు వేయడం, ఆ చేతులను నోటిలో పెట్టుకోవడం లాంటివి చేయడం వలన పిల్లల యొక్క జీర్ణ వ్యవస్థ డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అరగనటువంటి ఘన పదార్థాలను తినిపించడం ద్వారా కూడా వాళ్లకి మలబద్ధకం సమస్య తలెత్తే అవకాశం ఉంది.





మీ పిల్లలు పెరిగే కొద్దీ వారి జీర్ణ వ్యవస్ధ బలపడుతుంది. వారి పెద్దయ్యే వరకు ఏ సమయంలోనైనా వారి జీర్ణ వ్యవస్థ అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మీరు మీ పిల్లలకు ఎట్టిపరిస్థితిలో ప్యాకెట్ పాలు గానీ డబ్బా పాలు గానీ పట్టించుకోకూడదు. ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే వారం రోజులకు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని చెకప్ చేయించండి. విపరీతమైన జ్వరం, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, వాంతి చేసుకునేటప్పుడు రక్తస్రావం అవడం, విరోచనాలలో రక్తస్రావం లాంటి లక్షణాలు మీ పిల్లలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ చెప్పినట్లు వైద్య సలహాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ క్రమం తప్పకుండా మీ పిల్లలకు మందులు వాడండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: