కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుండడంతో బిజినెస్ చేసే వాళ్లు వారి షాప్స్ ను కూడా ఓపెన్ చేయటం లేదు. దింతో వారికి ఆదాయం కూడా రావడం లేదు. దింతో ఎస్‌బీఐ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. 

 

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద రూ.200 కోట్ల వరకు నిధులు పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. 2020 జూన్ 30 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 12 నెలల కాల పరిమితితో 7.25 శాతం వడ్డీకే రుణాలు పొందొచ్చని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అర్హత కలిగిన రుణ గ్రహీతలు కోవిడ్ 19 వల్ల లిక్విడిటీ సమస్యను ఎదుర్కుంటూ ఉంటే ఈ ఫండ్ కింద రుణాలు పొందొచ్చని వివరించింది.

 

అన్ని స్టాండర్డ్ అకౌంట్లకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. 2020 మార్చి 16 నాటికి ఎస్ఎంఏ 1 లేదా 2 కింద లేనటువంటి అకౌంట్లకు మాత్రమే ఈ రుణ సదుపాయం వర్తిస్తుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఎస్ఎంఏ అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్స్. మొండి బకాయిలుగా మారే లేదా ఎన్‌పీఏలుగా మారే అవకాశమున్న అకౌంట్లను కనుగొనేందుకు ఎస్ఎంఏ అకౌంట్లను బ్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

ఓవర్ డ్యూ పీరియడ్ 31 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటే అకౌంట్లను ఎస్ఎంఏ 1 అకౌంట్లుగా పరిగణిస్తారు. అదే ఎస్ఎంఏ 2 అకౌంట్ల విషయానికి వస్తే ఓవర్‌ డ్యూ పీరియడ్ 61 నుంచి 90 రోజుల మధ్యలో ఉంటుంది. ఈ రెండు అకౌంట్ల కిందకు రానుటువంటి రుణ గ్రహీతలు గరిష్టంగా కొత్త ఫండ్ నుంచి రూ.200 కోట్ల వరకు రుణం పొందొచ్చు.

 

పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఇందులో కరోనా వైరస్ వల్ల దేశంలోని 50 శాతం కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిందని వెల్లడైంది. దాదాపు 80 శాతం వ్యాపారాలకు బిజినెస్ తగ్గింది. క్యాష్ ఫ్లో తగ్గింది. అంతర్జాతీయంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటం ఇందుకు కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: