చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ప్రారంభ‌మైన క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ మంతా కోర‌లు చాస్తూ విజృంభిస్తోంది. క‌రోనాకు అస‌లు ఎప్ప‌ట‌కి బ్రేకులు ప‌డ‌తాయో ?  క‌రోనాకు ముందు క‌నుగొంటారా ?  క‌రోనా ఎప్పుడు అంత మ‌వుతుంది ? ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇంకెంత మ‌ది చ‌నిపోతారో ? అర్థం కాని ప‌రిస్థితి. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా భారీన ప‌డిన దేశాల సంఖ్య 200కు చేరుకుంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే క‌రోనా బాధితుల సంఖ్య 2.5 ల‌క్ష‌లు దాటేసి 3 లక్ష‌ల‌కు వెళుతోంది. ఇక క‌రోనా మృతులు సైతం 3 వేలు దాటుతున్నారు

.

ఇదిలా ఉంటే క‌రోనా మ‌న‌దేశంలో కూడా ఊహించ‌ని విధంగా చాప‌కింద నీరులా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా విస్త‌ర‌ణ‌కు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు బయటపడ్డ జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది. ఇక ఆదివారం ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపు మేర‌కు దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వంగా మోదీ దీనిని 24 గంట‌లు మాత్ర‌మే పాటించాల‌ని చెప్పారు.



అయితే ఇప్పుడు క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో మార్చి 31 వరకు జనతా కర్ఫ్యూ కొనసాగబోతోంది. ఈ జిల్లాల్లో మార్చి 31 వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల‌కు ఈ విష‌యం స్ప‌ష్టం చేసింది. ఆదివారం జ‌రిగిన స‌మీక్ష‌లో ఈ నిర్ణ‌యం తీసుకుంది

.

క‌రోనాను పూర్తిగా క‌ట్ట‌డి చేసేందుకు... క‌రోనా ప్ర‌భావిత జిల్లాల‌ను మూసివేయ‌డ‌మే ఇందుకు మేల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌ధాని పిలుపుతో ఆదివారం ప్రజలందరూ బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో దీన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: