కర్ఫ్యూ ప్రకటించారు నరేంద్ర మోదీ. ఈ రోజున ఎవ్వరు బయటకి రావద్దని కేవలం ఇళ్లల్లోనే ఉండాలని పిలుపు ఇచ్చారు ప్రధాని మోదీ .అయితే ఈ కర్ఫ్యూ  వల్ల ఎవరు ఇంటి నుండి బయటకి రాలేదు. కరోనాని కట్టడి చెయ్యడానికి ప్రజలు అంతా మేము సైతం అంటున్నారు. ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా నడుచుకుంటున్నారు.

 

 

అయితే ఈ కరోనా కారణం వల్ల రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. అలానే ప్రజలు కూడా బయటకి రావక పోవడంతో ఆనాధలు, యాచకులు ఆకలితో ఉన్నారు. అయితే భద్రాచలం పోలీసులు వీరికి భోజనం అలానే పండ్లు కూడా అందించారు. దేవుడిలా వచ్చి ఆ అనాధలని , యాచకులని ఆదుకున్నారు భద్రాద్రి పోలీసులు.

 

అయితే భోజనము, పండ్లు అందించి ఆ పోలీసులు ఆకలి తీర్చారు. అయితే వెంటనే ఆ యాచకుడు పోలీసులకి దండం పెట్టి దేవుడిలా వచ్చారయ్యా అన్నాడు. ఈ సన్నివేశం కెమెరాకు చిక్కింది. ఇప్పుడు ఆ వీడియో నేటిజన్ల మధ్య హల్ చల్ అవుతోంది. మానవత్వాన్ని చాటుకుని వీరు సాయం చేశారు.

 

 

నిజంగా సెల్యూట్ అంటున్నారు వీక్షకులు. తాజాగా తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు 21 నుండి 22  కి చేరింది. నిఘా మరికాస్త పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అలానే ఇటీవలే లండన్ నుండి ఒక వ్యక్తి గుంటూరు వచ్చాడట. అతనికి 24 సంవత్సరాలు. అతనికి కూడా పాజిటివ్ ఉన్నట్లు డాక్టర్లు తెలియ చేసారు.

 

 

ఇలా ఇండియాలో  కరోనా కేసులు దారుణంగా పెరిగి పోతున్నాయి. కరోనాని కట్టడి చెయ్యడానికి ప్రజలు అంతా మేము సైతం అని,  ప్రతి ఒక్కరో ఎంతో బాధ్యతగా నడుచుకుంటూ సూచనల్ని పాటించి జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా , సురక్షితంగా ఉండవచ్చు . కాబట్టి బాధ్యతో పాటించడం అత్యవసరం . 

మరింత సమాచారం తెలుసుకోండి: