ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేలాది మంది ప్రజలని కాటేస్తోంది. ఇప్పటికే వేలకి పైగా మరణాలు, లక్షలపై పైగా కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ కరోనా మహమ్మారి ఎలా విస్తరించింది, ఇది చైనా సృష్టే అంటూ మొదట్లో వ్యాఖ్యలు వినిపించినా చైనా తమ పౌరులని ఎందుకు చంపుకుంటుంది అంటూ లాజిక్ గా సందేహాలపై నీళ్ళు చల్లేలా చేశారు. కానీ అమెరికా యూరప్ లకి ఇప్పుడిప్పుడే అసలు విషయం అర్థమవుతోందని తెలుస్తోంది. కరోనా పేరుతో చైనా యావత్ ప్రపంచాన్ని దారుణంగా మోసం చేసిందని, తమ ఆర్ధిక వ్యవస్థని కాపాడుకునే క్రమంలో ఈ వైరస్ ని సృష్టించడం జరిగిందని అంటున్నారు అమెరికా యూరప్ దేశాలకి చెందిన పారిశ్రామిక వేత్తలు. అసలు ఇప్పుడు ఇలాంటి సందేహాలు వారికి కలగడానికి గల ఏకైక కారణం ఏమిటంటే...

IHG

చైనాలో అమెరికా యూరప్ కంపెనీలకి చెందినా బడా పారిశ్రామికవేత్తలకి భారీ స్థాయిలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ కరోనా ఎఫ్ఫెక్ట్ కారణంగా వారు అతి తక్కువ ధరలకే చైనా ప్రభుత్వానికి షేర్లు అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులపై ఇప్పుడు సదరు కంపెనీ లెక్కలు వేసుకుంటే అసలు విషయం బోధపడిందట. తమ ఆర్ధిక వ్యవస్థని కాపాడుకోవడానికి  ఇంతకి తెగించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమ దేశంలో మర్రి చెట్టులా విస్తరిస్తున్న అమెరికా,యూరప్ లని తరిమి కొట్టడానికి పక్కా ప్రణాళికలో భాగంగా చైనా కరోనా వైరస్ ని సృష్టించిందని అంటున్నారు.

IHG

చైనాలోని ప్రముఖ రసాయన కంపెనీలలో అమెరికా యూరప్ పెట్టుబడులే అద్యదికంగా ఉన్నాయి. దాంతో సగానికి సగం లాభాలు ఆయా దేశాలకి వెళ్లిపోవడంతో ఈ ప్రభావం చైనా కరెన్సీ పై పడింది. ఇరు దేశాలని తమ దేశం నుంచీ వెళ్ళగొట్టే అవకాశాలు లేనేలేవు. పొమ్మనలేక పోగాబెట్టారు అన్నట్టుగా కరోనాని అస్త్రంగా వాడుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనా వేసిన భారీ కరోనా ప్లాన్ లో భాగంగా కేవలం వ్యూహాన్ నగరం వరకే వైరస్ పరిమితం అయ్యేలా చూసుకుంది. అలాగే తమకి శానిటైజేన్ కొనుగోలు చేసే ఆర్ధిక బలం కూడా లేదని మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకోవడంతో ఒక్క సారిగా       ఆ దేశ పారిశ్రామిక రంగంపై అనుమానాలు పెంచాయి దాంతో విదేశీయులు తమ వాటాలని సగం రేటుకే అమ్మేసుకున్నారు. ఫలితంగా కేవలం రెండు రోజుల్లో 20 బిలియన్ డాలర్లు వెనకేసుకుంది చైనా. ఈ క్రమంలోనే అమెరికా యూరప్ పెట్టుబడి దారుల షేర్లు అన్నీ చైనా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి.

IHG

కరోనాని కనిపెట్టడమే కాదు విరుగుడు కూడా కనిపెట్టుకుని ఉంచుకుందని నిఘావర్గాల ద్వారా సమాచారం అందిందని అమెరికా యూరప్ పారిశ్రామిక వేత్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలాఉంటే చైనాలో కరోనా వరల్డో మీటర్ గణాంకాలు సైతం మరిన్ని అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ చైనా లో పుట్టిన తరువాత సుమారు 81,054 కేసులు నమోదు అయ్యాయి. అయితే వీటిలో సుమారు 72,440 కేసులు రికవరీ చేసింది చైనా అయితే మిగిలిన దేశాలలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి కానీ రికవరీ అయిన గణాంకాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. అసలు కరోనా పుట్టిన చైనాలో అత్యధికంగా  కేసులు రికవరీ అవడంతో ఆ దేశం ముందుగానే కరోనా విరుగుడు వైరస్ ని కనిపెట్టి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: