ఉత్తరాంధ్రలో విజయనగరం పూసపాటి రాజులకు కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. పరిపాలించారు మరియు శాసించారు ప్రజాస్వామ్యంలో కూడా చాలా మర్యాదలు గౌరవాలు అందుకోవడం జరిగింది. ఇటీవల గత రెండు తరాలుగా కూడా అనేక పదవులు అనుభవించటం జరిగింది. వంశపారపర్యంగా చూసుకుంటే పీవీజీ రాజు హయాం నుంచి  మొదలుపెడితే ఆయన కుమారులు ఆనదగజాతిరాజు, అశోక్ గజపతిరాజు నిన్నటి దాకా రాజ్యాంగ బధ్ధ పదవుల్లో కొనసాగినవారే. ఈ నేపథ్యంలో మూడవ తరం నాయకుడు కూడా తన ఇంటి నుండే రావాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు భావించడం జరిగింది. ఇందుమూలంగా గత ఏడాది 2019 సార్వత్రిక ఎన్నికలలో తన పెద్ద కుమార్తె అదితి గజపతిరాజు నీ విజయనగరం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు.

 

కానీ జగన్ ధాటికి టీడీపీకి ఎటువంటి దెబ్బ తగిలిందో, అదేవిధంగా అశోక్ గజపతిరాజు కుమార్తె ఓడిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సడన్ గా అశోక్ అన్నయ్య ఆనంద్ గజపతిరాజు కూతురు సంచయిత గజపతిరాజు ఎంట్రీ ఇచ్చి అటు మాన్సాస్ చైర్ పర్సన్ అయిపోయారు, ఇటు ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం సింహాచలం దేవస్థానానికి చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పరపతి ఈ దెబ్బతో రెట్టింపు అయింది. ఆమె మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా విజయనగరంలో తన పలుకుబడిని, పరపతిని బాగా పెంచుకునే అవకాశాలు ఉంటాయి.

 

దీంతో రాబోయే రోజుల్లో అశోక్ ఇలాకాలో సంచయిత గజపతిరాజు ప్రత్యర్థిగా ఎదిగే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో అశోక్ గజపతిరాజు ముందుచూపుతో తన కూతురు అదితి గజపతిరాజు నీ కూతురు సంచయిత గజపతిరాజు కి ప్రత్యర్థిగా దింపి ఇప్పటి నుండే వచ్చే ఎన్నికలకు సరికొత్త నయా స్కెచ్ రెడీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయనగరంలో రాజ వంశానికి చెందిన అక్క చెల్లెళ్ళ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: