ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత ప్రకటిస్తారు. ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ అద్భుతమైన పరిపాలన ఏపీ ప్రజలకు ఇస్తున్న వైయస్ జగన్ దేశంలో బెస్ట్ సీఎం గా మూడో స్థానంలో నిలిచారు. అంతా బాగానే ఉన్నా గానీ జగన్ ఒక విషయంలో మాత్రం చాలా నెగిటివ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అదేమిటంటే మీడియా. క్యాబినెట్ విషయాలు గానీ అదే విధంగా మీడియా సమావేశాలు కానీ నేరుగా జగన్ గెలిచిన తర్వాత పెద్దగా పెట్టిన దాఖలాలు లేవు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచమంతటా కరోనా వైరస్ బాగా విస్తరిస్తున్న తరుణంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో ఆదిలోనే వైయస్ జగన్ కరోనా వైరస్ గురించి మీడియా సమక్షంలో పారాసెట్మాల్ మరియు బ్లీచింగ్ పౌడర్ అంటూ తేలిగ్గా మాట్లాడటంతో...ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉండడంతో ఏపీ లో ఉన్న మీడియా కీలక సమయంలో జగన్ గాలి తీసే విధంగా కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రజల ప్రాణాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని మరోపక్క టీడీపీ ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. మరో పక్క వైఎస్ జగన్ మాత్రం కేవలం అధికారులతో సమావేశం అవ్వుతూ, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో నేరుగా మీడియాతో మాత్రం మాట్లాడటం లేదు.

 

దీంతో ఇటువంటి కీలక సమయంలో వైయస్ జగన్ చేజార్చుకున్నటు ఒక బాధ్యతగల పదవిలో ఉండి వ్యవహరిస్తున్నట్లు కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులతో తీసుకున్న నిర్ణయాలను వైయస్ జగన్ మీడియా ద్వారా బలంగా ప్రజలకు చేరవేసేలా యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తే చాలా బాగుంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: