ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రస్తుతం దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర రాష్ట్రంలో అంతా కంట్రోల్ లో ఉందని అధికారులు చెబుతున్నా గాని దాదాపు 20 వేలకు పైగా విదేశీయులు ఎటువంటి స్క్రీనింగ్ పరీక్షలు విమానాశ్రయంలో లేకపోవడంతో ఏపీలో కలిసిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల తో ఇంటింట సర్వే చేయించి ఎవరు వచ్చారు అన్న దాని గురించి వివరాలు అడిగి తెలుసుకునే పనిలో పడింది. అయితే ఇటువంటి నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ఆ పనిని సరిగా సమర్థవంతంగా నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇందువల్లనే విశాఖలో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన వ్యక్తి వాలంటీర్ల సర్వేలో కూడా గుర్తించలేక పోయినట్లు తాజాగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి హైదరాబాద్ టు విశాఖ రెండు సార్లు తిరిగారు. ఇంటి చుట్టుపక్కల వాళ్లతో కలుపుగోలుగా వ్యవహరించారు. అలాగే.. ఇరవై వేల మంది విదేశాల నుంచి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వారి వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. వివిధ రకాల డేటాలను ముందేసుకుని ఫోన్ల ద్వారా వారి ఆచూకీని కనిపెట్టేందుకు ప్రభుత్వం. .. ఓ మినీ కాల్ సెంటర్ లాంటిదాన్ని ప్రారంభించి ప్రయత్నాలు చేస్తోంది.

 

ఆ ప్రయాణంలో ఎంతమందికి  సదరు వ్యక్తి వైరస్ ని అంటించడం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ విధంగా చాలా మంది విదేశీయులు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలలో ఎటువంటి స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవటం తో జనారణ్యంలో కలిసిపోవడంతో...ఇది చాలా ఆందోళనకరంగా మారింది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐదు పాజిటివ్ కేసులు బయట పడినా గాని….ముందు ఏపీ భవిష్యత్ డేంజర్ జోన్ లో పడేటట్లు పరిణామాలు స్పష్టంగా ఉన్నాయని వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: