కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావంపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ...ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. సినిమా హళ్ళు, మాల్స్, స్కూల్స్, బస్సులు బంద్ చేసింది. అలాగే ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించింది. ఇటు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికి తిరిగి, విదేశాల నుంచి వచ్చిన వారు, తాజాగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తోంది.

 

ఇంకా కరోనా తీవ్రత పెరగకుండా ఉండేందుకు మరిన్ని రోజులు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించేందుకు చూస్తున్నారు. అయితే ఇలా సీఎం జగన్ ప్రభుత్వం ఏపీలో కరోనా వ్యాప్తి పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సీఎం జగన్‌కు మద్ధతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు  సైతం రాజకీయాలు పక్కనబెట్టేసి కరోనా వైరస్ పట్ల ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ నేతలు చేస్తున్న ఓ కార్యక్రమం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

అసలు ఓ వైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తుంటే, ఆ విషయంలో కూడా వైసీపీ నేతలు రాజకీయం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా రాకుండా అడ్డుగా ఉండే మాస్కులు వైసీపీ రంగుల్లో ఉండటం ఎబ్బెట్టుగా ఉందని అంటున్నారు. కరోనా వ్యాప్తి రాకుండా ఉండేందుకు దేశంలో అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు సాధారణ మాస్కులు పంపిణీ చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం వాళ్ళ పార్టీ రంగులో ఉన్న మాస్కులని పంపిణీ చేస్తున్నారు.

 

అది కూడా నేతలంతా గుంపుగుంపులు ఉంటూ...మాస్కులు అందిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు ఇదే కార్యక్రమం చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు సీఎం జగన్ అలా కష్టపడుతుంటే....మరోవైపు ఈ రకమైన కార్యక్రమాలు చేసి వైసీపీ నేతలు పరువు తీస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: