కరోనా మహమ్మారిని దేశం నుండి పారదోలేందుకు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి అని యావత్ భారతదేశం ఈరోజు చెప్పుకుంటున్నది. గురువారం రోజు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి 22న అనగా ఈరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించి మహమ్మారి కరోనా పై యుద్ధం చేసేందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. 

 

 


ఐతే అందరూ ఊహించినదానికంటే చాలా చక్కగా భారత దేశ ప్రజలందరూ ప్రధాని మోడీ మాటకి గౌరవం ఇస్తూ జనతా కర్ఫ్యూ ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. గురువారం రోజు మోడీ మరొక పిలుపును కూడా ఇచ్చారు. అదేంటంటే సామాన్య ప్రజలంతా ఇళ్లలో కూర్చొని ఉంటే... పోలీసులు, వైద్యులు, నర్సులు, అంబులెన్సు డ్రైవర్లు ఇంకా ఇతర సిబ్బంది రోజులో 24 గంటల పాటు కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్నారని... వారి సేవలను గుర్తించటం మన బాధ్యత అని... అలాగే వారిని అభినందించడానికి ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు అందరూ బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. 

 

 

 


అయితే ఈ పిలుపును కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ పాటిస్తూ చప్పట్లు కొట్టి కరోనా యోధులకు అభినందనలు తెలియజేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి కచ్చితంగా సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ కరోనా ని అంతమొందించేందుకు కృషి చేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: