మాయదారి కరోనా చైనాలో పుట్టుకొచ్చి ఇతర దేశాల్లో వ్యాప్తిచెందుతూ.. మరణ మృదంగం మోగిస్తుంది.  చైనాను దాటి ప్రపంచదేశాలపై పంజా విసురుతున్న కరోనా భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజులోనే ముగ్గురు మృతి చెందడం ఈ మహమ్మారి వ్యాపిస్తున్న తీరుకు నిదర్శనం. తాజా మరణాలతో భారత్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. భారత్‌లో కరోనా వైరస్‌ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా బీహార్‌ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కరోనా వైరస్ వల్ల చనిపోయినట్లు తెలిసింది. 38 ఏళ్ల అతనికి కిడ్నీ ఫెయిలైంది. మాంగెర్‌కు చెందిన అతనికి కరోనా పాజిటివ్ ఉంది.

 

కోల్‌కతా నుంచీ రెండ్రోజులు కిందటే పాట్నా వచ్చిన అతను ఎయిమ్స్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. అతడు పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవాళ మరణించిన మిగతా ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు గుజరాత్ కు చెందిన వ్యక్తి. వీరి మరణంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది.  మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 2కు పెరిగింది. గత 24 గంటల్లో 10 కేసులు నమోదవ్వగా  మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది. 

 

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 22కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి రావడంతో అతడిని పరీక్షించారు. దీంతో అతడికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.  ప్రస్తుతం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చైనా తర్వాత స్థానంలో ఇటలీ, ఇరాన్ ,స్పెయిన్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది. 3లక్షల 20వేలమందికి పైగా కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: