కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించే ఈ వైరస్.. భారత్ లోకి ప్రవేశించి వణికించేస్తోంది. దీంతో ఈ కరోనా వైరస్ అంతం చెయ్యడానికి ప్రధాని మోదీ ఆదివారం అంటే ఈరోజు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరుకు బయటకు రాకూడదు అని జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో భారత్ ప్రజలు అంత ఈరోజు ఇంట్లోనే ఉండిపోయారు. 

 

IHG

 

అయితే జనత కర్ఫ్యూ గురించి ప్రకటించిన రోజే సాయింత్రం ఐదు గంటలకు అందరూ ఇంటి బాల్కనీలోకి వచ్చి కరోనా వైరస్ బాధితుల కోసం రాత్రిపగుళ్ళు తేడా లేకుండా పని చేస్తున్న డాక్టర్లకు.. పోలీసులకు.. నర్సులకు.. మీడియా ప్రతినిధులకు అందరికి కృతజ్ఞతలు చెప్పాలని.. వారందరి వినిపించేలా సరిగ్గా 5 గంటలకు చెప్పట్లు కొట్టాలని చెప్పిన సంగతి తెలిసిందే. 

 

IHG

 

ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలందరూ కూడా చప్పట్లతో భారత్ ను మార్మోగించారు. సరిగ్గా 5 గంటలకు అందరూ కూడా చెప్పట్లు కొట్టి కరోనా బాధితులకు సేవ చేసే వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. అందరూ కూడా వారికి సెల్యూట్ తెలిపారు. 

 

IHG

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ బారిన పడి ఏకంగా కొన్ని వేల మంది మృతి చెందారు.. ఇప్పటికే ఈ కరోనా వైరస్ భారిన పడి 13 వేలమందికి పైగా మృతిచెందారు. 3లక్షలమందికి పైగా ఈ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇంకా ఈ నేపథ్యంలోనే భారత్ లోకి ప్రవేశించగా ఈ కరోనా వైరస్ ను అంతం చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: