సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు చేశారు. జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని అన్నారు. కర్ఫ్యూకు సంఘీభావ ఐక్యత చాటి చెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈరోజు 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. 
 
రాష్ట్ర ప్రజలందరూ ఈ నెల 31వ తేదీ వరకు ఇళ్లకే పరిమితం కావాలని... రాష్ట్రవ్యాప్తంగా 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితులలోను ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని సూచించారు. బయటకు ఐదుగురు మించి ఎట్టి పరిస్థితులలోను రావొద్దని కేసీఆర్ అన్నారు రాష్ట్రంలో చాలా సీరియస్ గా ఈ నిబంధనను అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. 
 
ఎవరైనా బయటకు వచ్చినా కచ్చితంగా 3 అడుగుల దూరం పాటించాలని చెప్పారు. ఇళ్లు, ఇంటి అవసరాలు, మందులు, పాల కు బయటకు వెళ్లినప్పుడు ఒకేరోజు 2,3 రోజులకు సరిపడా వస్తువులు తెచ్చుకోవాలని సూచించారు. మనల్ని కాపాడుకోవాలనే ఆలోచన ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈరోజు ఏ విధంగా ఉన్నారో ప్రతిరోజూ అదే విధంగా 31 వరకు ఉండాలని అన్నారు. 
 
రాష్ట్రంలో నిరుపేదలు ఆకలికి గురి కావద్దని అన్నారు. ప్రజలకు నెల రోజులకు ఒక్కొక్కరికీ 12 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని అన్నారు. డీలర్ల వ్యవస్థ ద్వారా వీలైనంత త్వరగా అందిస్తామని కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రతి రేషన్ కార్డుకు 1500 రూపాయల నగదు ఇవ్వనున్నామని కేసీఆర్ అన్నారు. ఈ నెలాఖరు వరకు అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తామని చెప్పారు. ఇతర రాష్త్ఱాల నుంచి వచ్చే వాహనాలను ఎట్టి పరిస్థితులలోను అనుమతించమని అన్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: