కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ కరోనా వైరస్ ఆగాలి అంటే మనం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. తరచూ సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి.. తుమ్ములు అడ్డు వస్తే మోచెయ్యి అడ్డు పెట్టాలి.. మనం శుభ్రంగా ఉండాలి.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి... 

 

ఇంకా ఈరోజు జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఏ ఒక్క ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని సూచించిన విధంగా ఏ ఒక్కరు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించారు.. రోడ్లపై లేకుండా అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు... ఎక్కడో కొన్ని చోట్లా కొందరు ప్రజలు బయటకు వచ్చారు. 

 

అయితే ఈ జనతా కర్ఫ్యూ ఎలా అయితే సక్సెస్ అయ్యిందో అలానే ఈ నెల 31వ తేదీ వరుకు ఇంట్లోనే ఉండాలి అని ఈ నెల 31వరుకు తెలంగాణ లక్ డౌన్ చేసారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇచ్చారు.

 

కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 31 వ‌ర‌కు ఉద్యోగులు బ‌య‌ట‌కు రాకూడ‌దు అని... పేప‌ర్ ఇన్విజిలేష‌న్ లేదు అని.. ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ టోట‌ల్ క్లోజ్‌ అని చెప్పారు. అంతేకాదు అత్య‌వ‌స‌ర ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు రావాలి అని.. మిగిలిన వాళ్లు 20 రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో రావాలి అని చెప్పారు. 

 

నిర్మాణ వ‌ర్క‌ర్లు.. కాంట్రాక్ట‌ర్లు అవుట్ సోర్సింగ్ వాళ్లు, కూలి జ‌నాలకు ఈ వారం రోజుల‌కు వేత‌నం త‌ప్ప‌క చెల్లించాలి అని.. ప్రైవేటు కంపెనీలు కూడా చెల్లించాలి అని.. ఇలాంటి అప్పుడు లాభాలు చూసుకోకూడదు భాగ‌స్వామ్యం తీసుకోవాలి అని అయన ప్రకటించాడు. అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆ నిర్ణయాలను పాటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: