తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మత ప్రచారానికి అని ఎక్కువమంది ఇతర దేశాల నుంచి తెలంగాణకు వస్తుండడంతో వారిలోనే కరోనా  పాజిటివ్ కేసులు నమోదవుతు  తెలంగాణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే ఇండోనేషియా నుంచి మత ప్రచారం కోసం మొత్తం 9 మంది ముస్లింలకు కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఇండోనేషియా నుంచి వచ్చిన ముస్లింలకు ఆశ్రయం కల్పించిన మరో ముస్లిం సోదరులకు కూడా కరోనా వైరస్ సోకింది. 

 

 ఈ నేపథ్యంలో ఇండోనేషియా నుంచి కరీంనగర్  వచ్చిన ముస్లింలకు ఆశ్రయం  కల్పించానని  తెలిస్తే తనకు శిక్ష పడుతుందని భయపడిన తెలంగాణ ముస్లిం సోదరుడు పోలీసులకు  కనిపించకుండా తప్పించుకుంటూ తిరిగాడు. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఇండోనేషియా నుంచి నేరుగా కరీంనగర్ కు వచ్చిన ముస్లింలు.. కరీంనగర్ లో  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనను కొనసాగించారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దేశం కాని దేశం వచ్చి రెచ్చగొట్టే విదంగా  మత ప్రచారం చేసిన వారిని ఉగ్రవాదులు గానే పరిగణించినప్పటికీ... ప్రస్తుతం అంతకంటే ప్రాణాంతకమైన కరోనా  వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ అయ్యింది దీంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు. 

 

 ఎందుకంటే ఇండోనేషియా నుంచి వచ్చిన సదరు ముస్లిం సోదరులు ఎక్కడెక్కడికి తిరిగారు ఎంతోమందిని కలిశారు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి వల్ల తెలంగాణ వాసులకు కూడా  కరోనా  వైరస్ సోకింద అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఇక ఇండోనేషియా నుంచి వచ్చిన ముస్లింలకు ఆశ్రయం కల్పించిన... తెలంగాణ ముస్లిం సోదరుడు  కూడా గత కొన్ని రోజులుగా పోలీసుల కంటపడకుండా తిరగడంతో అతని ద్వారా కరోనా  వైరస్ ఎంతమందికి వ్యాపించిందో  అనే భయం ఆందోళన మొదలైంది. అయితే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతని ఆసుపత్రిలోనే చికిత్సలు  జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: