ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఒకే ఒక్క పేరు కరోనా.. ప్రపంచ దేశాలు దాన్ని నివారించుటకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇక మనదేశంలో కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కరోనాపైన తీవ్రమైన కసరత్తులు చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి విదితమే. రాష్ట్రంలో ఇప్పటికే విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. 

 

 

 

పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఇక ఇక్కడ కీలక విషయం ఏమంటే, ప్రధాని మోదీ ప్రకటించిన  జనతా కర్ఫ్యూని 24 గంటలకు పొడిగించింది. ఇక రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయాలని అనుకుంటున్నారు. ఐతే కరోనావైరస్ రోజురోజుకూ వేగవంతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు జనతా కర్ఫ్యూని పొడిగించాయి. ఒక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించిది కేంద్రం. 

 

 

 

ఈ జాబితాలో తెలంగాణకు చెందిన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కలవు. మార్చి 31 వరకు ఇక్కడ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఇక వీటితో పాటుగా  అన్ని జిల్లాల్లోనూ లాక్‌డౌన్ ప్రకటించే అవకాశముందని ఇపుడు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 

 

 

 

ఈ సందర్భంగా, ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ లైవ్‌ను క్రింద మీరు చూడొచ్చు. ఇప్పటికే కరోనా వైరస్ నివారణకు ఆరోగ్య నిపుణులు పలు విధాలైన విధి విధానాలను సూచించిన సంగతి తెలిసినదే. ముందు జాగ్రత్తగా ఆయా ప్రక్రియలను పాటిస్తే... మెరుగైన ఫలితం ఉంటుందని వారంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: