ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వైరస్ భారత్ లో కి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఏ ఒక్కరు బయటకు రాకూడదు అని జనత కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నేడు కరోనా వైరస్ వ్యాప్తిపై మాట్లాడుతూ.. కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే ఈ నెల 31వ తేదీ వరుకు అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అని కుటుంబం నుండి కేవలం అంటే కేవలం ఒక్కరే బయటకు రావాలని.. అయన చెప్పారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు అన్ని బస్సులు బంద్ అని అయన ప్రకటించాడు.. 

 

ప్రైవేటు ఆటోలు కూడా బంద్‌. ఇక రైల్వేలు కూడా ఇప్ప‌టికే బంద్‌ అయ్యాయి.. టోట‌ల్‌గా ఎవ‌రి ఇళ్ల‌కు వారు ప‌రిమితం కావాలి అని అయన చెప్పారు... ఇక నిత్యావ‌స‌రాల కోసం ఇంటి నుంచి ఒకే ఒక్కరు బ‌య‌ట‌కు రావాలి అని అయన చెప్పారు. తెలంగాణ అంత కూడా ఈ నెల 31 వరుకు బంద్.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించి ఇంట్లోనే ఉండి తెలంగాణాలో కరోనా వైరస్ ను తరిమికొట్టండి.   

 

కాగా చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఇంకా కరోనా వైరస్ బారిన పడి 13వేలమంది మృతిచెందారు.. 3 లక్షలమందికి పైగా ఈ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణాలో అయితే ఏకంగా 26మంది కరోనా బారిన పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: