ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌లాకుతలం చేస్తున్న క‌రోనా వైర‌స్ వ‌ల్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రికి ఉంది. ఇక ప్ర‌యాణికులు ఒక‌రి నుంచి ఒక‌రు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైధ్యులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తున్నారు.ఇక ప్ర‌యాణాలు అయితే మాత్రం అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉన్నారు.  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారుల‌ నిర్లక్ష్యం వందలాది మందిని టెన్షన్ పెడుతోంది. విదేశాల నుండి ప్ర‌యాణికులు వ‌స్తున్న‌ప్పుడు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుండా  జాగ్ర‌త్త‌గా చూడ‌క‌పోయే స‌రికి అసలే బిక్కు బిక్కు మంటూ ఇంటి దారి పట్టిన ప్రయాణికుల భయం మరింత పెరిగిపోయేలా చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటర్నేషనల్ టెర్మినల్, దేశీయ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా దేశీయ టెర్మినల్ ఉంటుంది. దేశంలోని ఇతర ఎయిర్‌పోర్ట్‌ లతో పోలిస్తే ఈ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్దది. మ‌రి ఇక్క‌డ అలాంటి స‌దుపాయాలు ఎక్కువ‌గా ఉండాలి.

 

అయితే… కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియా వాళ్లంతా ఆయా దేశాల నుండి స్వదేశానికి వచ్చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాలు కూడా ఆదివారం అర్ధరాత్రి నుంచి రద్దు కానుండటం తో విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఇక్క‌డ చేయ‌వ‌ల‌సిన చెకింగ్‌లు స‌రిగి జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వీరందరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, క్వారంటైన్ కు పంపాలి. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు లోకల్ ప్రయాణికులను, అంతర్జాతీయ ప్రయాణికులను ఒకే చోట ఉంచటం తో కరోనా వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉంది. మ‌రి వీరిని వేరు వేరు చోట ఉంచి చెకింగ్‌లు జరిపితే బావుంటుంది. దీనితో ప్రయాణికులు అధికారుల పై మండి పడుతూ… ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్యాధి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సంక్ర‌మించే అవ‌కాశాలు చాలానే ఉన్నాయ‌న్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోతున్నారు.

 

ఈ ర‌క‌మైన‌ ఘటనల పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప‌క్క వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే… కొందరి అధికారుల తీరుతో అవన్నీ బూడిదపాలు అవుతున్నాయని, అధికారులు మరింత బాధ్యతగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది అని స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఇంకా చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అశ్ర‌ద్ద చేయ‌కూడ‌దంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: