ప్ర‌తి ఒక్క‌రు మాన‌వ‌జీవితంలో సుఖ సంసారాన్ని చ‌క్క‌గా ఎంజాయ్ చేయాలి. ప్ర‌స్తుం తీవ్ర‌మై ఒత్తిళ్ల నేప‌థ్యంలో చాలా మంది సుఖ సంసారం అనే జీవితాన్ని స‌రిగా ఎంజాయ్ చేయలేక‌పోతున్నారు. చాలా మందికి వీకెండ్‌లో మాత్ర‌మే ఇలాంటి టైం దోరుకుతుంది. శ‌ని, ఆదివారాల్లో చ‌క్క‌గా రెడీ అయ్యి బెడ్ రూంలోకి వెళ్లి శృంగారం మూడ్‌లోకి వెళ్లామో లేదో బ‌య‌ట డిస్ట‌బెన్స్‌లు చాలా మందికి ఎదుర‌వుతూ ఉంటాయి. చాలా మంది లోప‌ల శృంగారానుభూతిలో ఉండ‌గానే ఆ డిస్ట‌బెన్స్‌ల‌ వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి శృంగారాన్ని స‌రిగా ఎంజాయ్ చేయ‌లేరు.

 

దీని వ‌ల్ల వారానికి వ‌చ్చిన ఒక‌టి రెండు రోజుల్లో కూడా శృంగారం చేయ‌క‌పోతే మ‌నుష్య‌లుపై తీవ్ర‌మైన ఒత్తిడి ఉంటుంది. శృంగారాన్ని స‌రిగా ఎంజాయ్ చేయ‌క‌పోతే అనేక ర‌కాల జ‌బ్బులు కూడా వ‌స్తాయి. ఇందులో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు ప్ర‌ధాన‌మైన‌వి. ఒత్తిడి నుంచి ప్ర‌తి ఒక్క‌రికి ఉప‌శ‌మ‌నం కావాలి. ఈ ఉప‌శ‌మ‌నంలో శృంగారం కీల‌క పాత్ర పోషిస్తుంది. అందుకే ముందుగా రూమ్ క్లైమేట్ అన్న‌ది బాగా ఉండేలా చూసుకోవాలి. 

 

అందుకే మ‌న‌కు మ‌న‌స్సుకు న‌చ్చిన‌ట్టుగా ముందు రూమ్ క‌ల‌ర్ ఉండాలి. అలాగని చెత్త క‌ల‌ర్ ఎంచుకోకూడ‌దు. సరిగ్గా లేని కలర్స్ ఎంపిక చిరాకు తెప్పిస్తుంది. మానసిక స్థితిపై ప్రభావితం చూపుతాయి. బెడ్ రూమ్ గోడపై మెరుస్తున్న షైనీ కలర్స్‌తో ప్రయోగాలు చేయొద్దు. సాఫ్ట్ కలర్స్ బెడ్ రూములకి బాగా సరిపోతాయి. ఇవి మ‌న‌కు మంచి మూడ్ క్రియేట్ చేస్తాయి. ఇక బ‌య‌ట శ‌బ్దాలు విన‌ప‌డ‌కుండా సీలింగ్ ఉండాలి.. సీలింగ్ ఛాన్స్ లేని వాళ్లు కిటికీలు.. రంధ్రాల ద‌గ్గ‌ర చెక్క‌లు పెట్టుకోవాలి. ఇక సాఫ్ట్ వాల్ ప్లేట్స్ బెడ్ రూములకు చాలా మంచిది. సాఫ్ట్ ప్లేట్స్ మంచి అనుభూతిని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. పడుకునేటప్పుడు శబ్దాలు లేకుండా చూసుకోవాలి. అప్పుడు శృంగారం చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: