దేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుంది. దీనిని కొంత అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా ఆరుగురు మృతి చెందిన పరిస్థితి.

 

 

దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో కర్ణాటక ఒక్కటి. ఇక ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రములో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దింతో ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కంట్రోల్ కోసం రెండు నెలల రేషన్ ఫ్రీగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

 


 
ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టటం కోసం ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు రాకుండా సరిహద్దులను మూసివేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించారు. అక్కడి ప్రజలకు రెండు నెలల రేషన్‌ను ఫ్రీగా ఇవ్వనున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది. దీనిని వలన ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించాలని నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. 

 

 

రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఇంకా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను తమ ప్రయాణాలను 15 రోజులు వాయిదా వేసుకోవాలని యడియూరప్ప కోరారు. ఇప్పటికే థియేటర్లు , షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలను ఇప్పటికే మూసి వేశారు. అటు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహిస్తారని సీఎం పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ క్లాసు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

 

 

 బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో 1700 పడకలను సిద్దం చేశామన్నారు. కరోనా బాధితులకు అక్కడే చికిత్స అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతులు మేరకు ప్రైవేటు, గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ల్యాబ్ లు పెట్టి టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: