కరోనా వైరస్ దెబ్బకి మనుషులే కాదు, ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలు మంటున్నాయి. పెద్ద వ్యాపారులే కాదు, చిరు వ్యాపారులు కూడా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులను కూడా కొనలేని పరిస్థితి నెలకొని వుంది. ఈ తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

 

ఆనంద్ మహీంద్రా తమ ఉద్యోగుల ఆరోగ్యం కోసం మహీంద్రా కంపెనీలో వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా, దేశంలో కరోనా వైరస్ స్టేజ్ 3కి చేరుతున్న నేపథ్యంలో కరోనా సోకిన వారి సంఖ్య బాగా పెరగొచ్చనే అంచనాలు అంతటా నెలకొనున్నాయి. అందుకే తమ కంపెనీల్లో వెంటిలేటర్ల తయారీ విషయాలను చర్చిస్తున్నామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

 

 

అంతే కాకుండా, మహీంద్రా హాలిడేస్ సంస్థ తన రిసార్ట్స్‌ను మెడికల్ కేర్ సెంటర్లుగా వినియోగించుకోవచ్చని చెప్పడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆనంద్ మహీంద్రా మనసు చాలా గొప్పదని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పొగుడుతున్నారు. వైరస్ సోకిన వారికి ఈ రిసార్ట్స్‌లో ఆశ్రయం ఇచ్చి, వైద్యం చేయొచ్చు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కరోనా వల్ల నష్ట పొతే.. వారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా మహీంద్రా ఫౌండేషన్ ద్వారా ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

ఈ ఫండ్‌కు ఆనంద్ మహీంద్రా తన 100% శాలరీని విరాళంగా ప్రకటించడం విశేషం. బయటవాళ్ళు కూడా  స్వచ్ఛందంగా ఈ ఫండ్‌కు విరాళం అందించొచ్చని అయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 10 వేలకు పైమాటే. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికి సోకగా, ఇండియాలో 300కు పైగా మందికి కరోనా ఉంది. ప్రస్తుతం భారత్ స్టేజ్ 3లో ఉన్నట్లు నివేదికలు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: