ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లోనూ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఈ వైర‌స్‌కు బ్రేకులేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆదివారం ప్ర‌తి ఒక్క‌రు స్వ‌చ్ఛందంగా ఇంట్లోనే ఉండి జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించ‌డంతో పాటు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్ల‌తో ఈ మ‌హమ్మారి సోకిన వారికి ప్రాణాల‌కు తెగించి వైద్యం చేస్తోన్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని కోరారు. మోదీ పిలుపును అందుకున్న ప్ర‌తి ఒక్క‌రు దేశ‌వ్యాప్తంగా ఉద‌యం నుంచి బ‌య‌ట‌కు రాలేదు.

మ‌హాన‌గ‌రాలు అన్ని మూగ‌బోయాయి. ఎవ‌రికి వారు రోడ్ల‌మీద‌కు రాలేదు. పెద్ద పెద్ద న‌గ‌రాల్లో చీమ చిటుక్కుమ‌న‌లేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగానే ప్రెస్‌మీట్ పెట్టి జ‌న‌తా క‌ర్ప్యూకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంట‌లు అయిన వెంట‌నే తెలంగాణ
రాజ్‌భ‌వ‌న్‌తో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై అంద‌రి కంటే ముందుగానే బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్ల‌తో వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల‌కు త‌న అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌హ‌చ‌రు మంత్రులు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఐదు నిమిషాల పాటు సంఘీభావం తెలిపారు

.

ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి గంట మోగిస్తూ మ‌ద్ద‌తు చెప్పారు. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్ల‌తో క‌ర్ఫ్యూకు స‌పోర్ట్ చేశారు. ఇక హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మంత్రి హ‌రీష్‌రావు బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్ల‌తో త‌న మ‌ద్ద‌తు తెలిపారు. ఇక తెలంగాణ మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు... ఏపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు , మంత్రులు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు లేదా గంట గొట్టారు.



జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంటి ముందు క‌ట్టిన గంట మోగించారు. ఇక కేంద్ర మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌, రాజ్‌నాథ్ సింగ్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్ల‌తో క‌ర్ప్యూకు మ‌ద్ద‌తు తెలిపారు. ఏదేమైనా భార‌త‌దేశ చ‌రిత్రలో అప్పుడెప్పుడో ఏ స్వాతంత్య్ర పోరాటం చేసిన‌ప్పుడో ఇంత ఐక్య‌త వ‌చ్చి ఉంటుంది.. మ‌ళ్లీ చాలా రోజుల‌కు మ‌న‌మంద‌రం చాటిన ఐక్య‌త ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కే ఆద‌ర్శంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: