కరోనా వైరస్‌పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి చెందకుండా రెండు రాష్ట్రాల సీఎంలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, ప్రజల్నిఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపు మేరకు రెండు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. ఇక కరోనా వ్యాప్తిపై మరింత కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు

 

అయితే ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ప్రతి కార్డుకు నెలకు 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని తెలిపిన కేసీఆర్.... లాక్‌డౌన్ కాలంలో రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 ఇస్తామని వెల్లడించారు. అందుకోసం రూ.1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ తెలంగాణ మంచి ఆదాయం గల రాష్ట్రం, కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు.

 

కానీ ఏపీ అలా కాదు. లోటు బడ్జెట్‌లో ఉంది. 3 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాలకు జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. పైగా రాష్ట్రానికి పెద్దగా ఆదాయం రావడం లేదు. ఇప్పుడు కరోనా వల్ల ఆర్ధిక పరిస్తితి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లాక్ డౌన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషన్, కేజీ పప్పు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మార్చి 29వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని జగన్ చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి రేషన్, రూ.1000 ఇచ్చి వెళతారని జగన్ ప్రకటించారు. ఉచితంగా రేషన్, రూ.1000 చొప్పున ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఖర్చు అవుతాయని జగన్ అన్నారు.

 

తెలంగాణలో కంటే ఏపీలో జగన్ ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్నారు. ఇంకా ముఖ్యంగా ప్రతి ఇంటికి రేషన్ తీసుకెళుతూ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జగన్‌ని మెచ్చుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: