లోకంలో ఒక వైపు కరోనా వచ్చి జనం చచ్చిపోతుంటే బాధ్యతగా ఉద్యోగం చేయవలసిన అధికారులు తమ బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు.. ఇలా అందరు కాదు కొందరు మాత్రమే.. ఇక అసలు విషయం ఏంటంటే.. సివిల్‌ కేసులో చీమకుర్తి ఎస్సై నాగశివారెడ్డి జోక్యం చేసుకొని ఓ వివాహితపై జులుం ప్రదర్శించాడు. ఆ వివాహితతో పాటుగా ఆమె భర్తను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిచి దుర్భాషలాడాడు.. ఇదే కాకుండా ఆమెపై చేయిచేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి వచ్చిన వెంటనే పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుత పరిస్దితుల్లో  చావుబతుకుల మధ్య వైద్యశాలలో కొట్టుమిట్టాడుతోంది.

 

 

ఆ విషయం తెలుసుకుంటే పట్టణంలోని వడ్డె పాలెంనకు చెందిన చల్లా పద్మావతి అనే వివాహిత సంగం తులశమ్మ వద్ద రూ. 30వేలు అప్పు తీసుకుని ప్రామిసరీ నోటు పైన సంతకం చేసింది.. అయితే వారం క్రితం పద్మావతి అనే వివాహిత అసలు చెల్లించి ప్రామీసరి నోటు అడగ్గా వడ్డీ చెల్లిస్తేనే ఇస్తానని తులశమ్మ ఖచ్చితంగా చెప్పింది. ఇక పద్మావతి వారం రోజులైనా వడ్డీ కట్టకపోవడంతో తులశమ్మ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై నాగశివారెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన పద్మావతి, ఆమె భర్తను శుక్రవారం ఉదయం స్టేషన్‌కు పిలిపించారు. మధ్యాహ్నం వరకూ వారిని స్టేషన్లోనే ఉండనిచ్చి, ఆతర్వాత రాత్రికి వచ్చి కలవాలని చెప్పి పంపారు. కాగా ఆ దంపతులు రాత్రి 6 గంటలకు వచ్చిన అప్పటివరకు వారిని బయటే నిలబెట్టి రాత్రి 10 గంటలకు లోపలికి పిలిచాడట ఎస్‌ఐ..

 

 

ఆ తర్వాత వారిపట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించక వారి మనసును గాయపరచగా మనస్తాపానికి గురైన పద్మావతి ఇంటికి వెళ్లిన వెంటనే పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్టణంలోని ఓప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఈ విషయంపై స్పందించి ఎస్సై నాగశివారెడ్డి.. పద్మావతిపై తమకు అందిన ఫిర్యాదు మేరకు మాత్రమే  స్టేషన్‌కు పిలిచి, భార్యాభర్తలకు నచ్చచెప్పి పంపానే గాని ఆమె ఆత్మహత్యా యత్నంతో ఎలాంటి సంబంధం తనకు లేదని పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: