భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ఎఫెక్టు  పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ఎంత నిర్బంధం విధించినప్పటికీ ఏదో విధంగా కరోనా వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. రోజురోజుకు శరవేగంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా  వైరస్ ను  పారదోలేందుకు ఎన్నో కఠిన నిబంధనలు అమలు లోకి తీసుకున్నారు. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఎక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 20కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదు... ఆంధ్రప్రదేశ్లో 5కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

 

 ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ ను  నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా సంస్థలు పూర్తిగా బంద్ అవుతాయని.. కేవలం ప్రజలకు అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటూ ఇరు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు అన్నింటికీ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. 

 


 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ రోజురోజుకు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కరోనా  వైరస్ ను  పారదోలేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో... పదవ తరగతి పరీక్షల పై కూడా కీలక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  ఉన్నప్పటికీ పదోతరగతి పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మార్చి 31 నుంచి యధావిధిగా పదవతరగతి పరీక్షలు నిర్వహించబడతాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: