భారతదేశం లో అడుగు పెట్టిన కరోనా  వైరస్ రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ఏకంగా 300 మందికి పైగా ఈ వైరస్ సోకింది. దీంతో భారతదేశంలో రోజురోజుకి ప్రజల్లో  భయాందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక ఈ  వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో అందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ను  భారతదేశంలో కంట్రోల్ చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ  అందరికీ జనతా కర్ఫ్యూ కి  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.నిన్న  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశంలోని ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ... హాయిగా ఫ్యామిలీతో కడుపుతూ .. కంటికి కనిపించని శత్రువుతో ... ప్రాణాలను హరించి అందరిని భయాందోళనకు గురి చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు పోరాటం చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. 

 

 ఈ నేపథ్యంలో భారత ప్రజలందరూ మరోసారి ఐక్యతను చాటి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేసారు.  అయితే భారత ప్రజలు అందరూ కేవలం జనతా కర్ఫ్యూ  నిర్వహించడమే కాదు పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా కరోనా  వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చు అంటూ ఇప్పటికే అటు వైద్యులు కూడా సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ మరో సూచన కూడా చేశారు. దేశ ప్రజలు అందరూ కలిసికట్టుగా కరోనా  వైరస్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అంటూ  పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ... జనతా కర్ఫ్యూ ని  సుదీర్ఘకాలం పాటు కొనసాగిద్దాం అంటూ పిలుపునిచ్చారు. 

 


 మనకి మనం స్వీయ  నిర్బంధాన్ని విధించుకుని సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా  వైరస్ ను  నియంత్రించవచ్చు అంటూ సూచిస్తున్నారు. ఇలా స్వీయ  దిగ్బంధం విధించడం ద్వారా... ప్రస్తుతం కరోనా  వ్యాప్తి దేశవ్యాప్తంగా తగ్గి పోతుంది అంటూ సూచిస్తున్నారు. అయితే దేశ ప్రజలందరూ కొన్ని రోజుల పాటు స్వీయ దిగ్బంధంలో కి వెళ్ళాలి అంటూ  ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలందరికీ సూచన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: