తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే నిన్న మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్  చేయాలని కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను పాటించినట్లు గానే  మార్చి 31 వరకు లాక్ డౌన్  ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీస్ లు  మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటూ  తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని సూచించారు. 

 


 రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తారు... రవాణా సౌకర్యాలు మొత్తం పూర్తిగా బంద్ అవుతాయి . అత్యవసరాల తీసుకొచ్చి వాహనాలను మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి అంటే. ఆస్పత్రిలో అత్యవసర విభాగాలకు సంబంధించిన సేవలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి మిగతా సేవలను రద్దు అవుతాయి. హాస్పిటల్లో మెడికల్ షాపులు సూపర్ మార్కెట్లు,  పాలు,  కూరగాయలు షాపులు లాంటివి మాత్రమే తెరిచి ఉంటాయి. కిరాణా దుకాణాలు, ఆఫీసులు కార్యాలయాలు అన్ని మూసివేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అత్యవసర విభాగాలకు చెందిన వారే విధులకు హాజరు అవుతారు. ప్రైవేటు ఉద్యోగులు ఇంట్లో నుంచే పని చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు గుంపులుగా చేరడం నిషేధం. ఇక ఫంక్షన్లు పెళ్లి లాంటివి కూడా ఎక్కువగా జనాలు హాజరవడం కుదరదు. 

 

 ఇక లాక్ డోన్ విధించారు కదా ఎలాగో ఇంటిపట్టునే ఉంటాం సరదాగా పిల్లలని తీసుకుని బయటకి వెళ్దాం అంటే మాత్రం కుదరదు. బయట ఎలాంటి ఫుడ్ దొరకదు కాబట్టి... మనమంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా స్వీయ నిర్బంధం విధించుకోవడంమే మంచిది . ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంకే సమయంలో కూడా బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా స్నేహితులను పిలిపించుకొని సరదాగా ముచ్చటించడం.. పిల్లలతో బయటికి వెళ్లడం లాంటివి చేయడం నిషేధం. ఎంత విసుకు అనిపించినా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇది తప్పదు, 

 


 అందుకే ఇంట్లో కి సరిపడా సరుకులు అత్యవసరమైన మందులు కొవ్వొత్తులు ఇలాంటివి సమకూర్చుకోవాలి. నిర్ణీత సమయంలోనే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అయిన సందర్భంగా... బ్యాంకులు ఏటీఎం లు తెరిచే ఉంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలు,  పోస్టాఫీసులు, టెలికాం సేవలు అందించే సంస్థలతో పాటు పెట్రోల్ బంకులు, సీఎన్జీ బంకులు కూడా తెరిచి ఉంటాయి. ఇక ఎల్పిజి గ్యాస్ సేవలు, మెడికల్ షాపులు, హాస్పిటల్, నిత్యవసర వస్తువులను విక్రయించే షాపులు, పండ్లు కూరగాయలు షాపులు విక్రయించే దుకాణాలు కూడా తెరిచే ఉంటాయి. కానీ సాధారణ పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఎక్కువ మొత్తంలో తెరిచి ఉండవు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూసివేసినప్పటికీ పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మాత్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైన్ షాపులు పూర్తిగా మూసివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: