కరోనా అందరిని కలవర పెడుతుంటే ఒక వ్యక్తికి మాత్రం సంపాదన తెచ్చిపెట్టింది.. ఇది నమ్మలేని నిజం.. అంతే కాదు లక్షల మందిలో ఒక్కరికి దక్కే అదృష్టం.. ఇక కరోనాతో లైఫ్‌లో సెటిల్ అయిన ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే.. అతని పేరు ఇజారుల్.. ఇతని వృత్తి కార్పెంటర్.. ఇతను పశ్చిమ బెంగాల్ వాసి అయినప్పటికీ బతుకు తెరువు కోసం కేరళ వెళ్లాడట.. ఒక్క పూట గడపడానికి నానా కష్టాలు పడుతున్న ఇతను కేరళ వెళ్లితే కొంత సంపాదన ఎక్కువగ రాగా సంతోషంగా తన కుటుంబాన్ని సాకవచ్చని భావించి వెళ్లాడు.. కానీ ఇటీవల కేరళలో కూడా కరోనా ప్రబలడంతో అతడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తన స్వరాష్ట్రానికి చేరుకున్న ఇతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి..

 

 

అప్పటివరకు రెక్కలు ముక్కలుగా చేసుకుని సంపాదించిన డబ్బులతో కాలం వెళ్లదీస్తుండగా అవి కాస్త అయిపోవడానికి రాగా ఎలా బతకాలో తెలియని ఆ వ్యక్తి ఒక లాటరీ టికెట్ కొన్నాడట.. కరోనా నేపధ్యంలో అందరికి ఇబ్బందులు వస్తున్న సమయంలో అతనికి మాత్రం అదృష్టం జలగపట్టినట్లుగా ఆ లాటరికి మరునాడే డబ్బులు తగిలాయట.. అంతే ఒక్కరోజులో అతని జీవితం పూర్తిగా మారిపోయింది.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడట.. ఇన్నాళ్లు కూలిడబ్బుల కోసం నిదుర లేని రాత్రులు గడిపిన అతనికి ఒక్క సారే అంత డబ్బు రావడంతో ఉబ్బితబ్బిబ్బై పోతు వచ్చిన డబ్బుతో ఎలా జీవించాలో పక్కాగా ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నాడట..

 

 

అంతే కాకుండా తన కుమారులను మంచి చదువులు చదివించి, ఇల్లు కట్టుకోవడంతో పాటూ సొంతంగా వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తానని అతడు స్థానిక మీడియాకు చెప్పాడు.  అయితే గతంలో కేరళ వరదల సమయంలోనూ అతడు ఇలాగే  ప్రాణాలు అరచేత పెట్టుకుని స్వరాష్ట్రానికి తిరిగొచ్చాడు. ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగినప్పటికీ కరోనా వైరస్ రూపంలో అతడికి అదృష్టం కలిసొచ్చింది. ఇక ఈ వార్త అక్కడి స్థానిక మీడియాలో వచ్చి తెగ సంచలనం సృష్టిస్తోందని చెబుతున్నారు.. ఒక వేళ ఇదేకనుక నిజం అయితే ఇతనికంటే అదృష్టవంతులు ఉండరు.. ఇది అబద్దమైతే ఇలా జరిగితే బాగుండుననే ఉహా చాలా అందంగా ఉంటుందను కుంటున్నారట కొందరు నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: