దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని విధాలుగా కూడా ఈ వైరస్ ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతుంది. దీని దెబ్బకు భారత ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిపోయింది. ప్రపంచ దేశాలు ఇప్పటికే కుదేలు అయిపోయాయి. దేశంలో అన్ని రంగాలు కూడా ఇప్పుడు కరోనా తీవ్రతకు ఇబ్బంది పడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదని అర్ధమవుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల కోసం సినీ పరిశ్రమ ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా బాధితుల కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు సాయం చెయ్యాలని చూస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగూ టెస్టులు చేయించుకుంటారు కాబట్టి... డబ్బులు లేని వాళ్ళ కోసం ముందుకి రావాలని ఇందుకోసం ప్రభుత్వ సహాయ నిధికి తమ వంతు విరాళం అందించాలని భావిస్తున్నారు. వంద మంది కరోనా వైరస్ బాధితుల కోసం టెస్ట్ లకు 5 వేలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ విషయంలో ముందు అడుగు వేస్తున్నట్టు సమాచారం. 

 

అలాగే నానీ సహా మరికొందరు హీరోలు బయటకు వచ్చి వెయ్యి మంది వరకు సహాయం చేసే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నారట. ఇక కరోనా ప్రచారాన్ని కూడా ఫ్రీ గా చెయ్యాలని భావిస్తున్నారు. టీవీ లో ప్రకటనలు ఇచ్చే విషయంలో ఏ విధంగా కూడా డబ్బులు తీసుకోవద్దని ప్రభుత్వాలకు కూడా పూర్తిగా సహకరించాలని భావిస్తున్నారు. యువ హీరోలు కూడా ఈ విషయంలో ముందుకి వచ్చి తమ వంతు సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 400 కి దగ్గరలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: