కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఎలాగైనా కరోనాకు స్వస్తి చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.. 

 

 

 

ఈ మేరకు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు చాలా మంది రాత్రియంబవళ్ళు కష్టపడుతున్నారు. కరోనా వారిని ప్తయేక వార్డులలో ఉంచి వారికి తగిన చికిత్సలను అందిస్తూ వస్తున్నారు  భారత్ ను ముప్పుతిప్పలు పెడుతున్నా ఈ కరోనా ప్రభావం ప్రజలను మానసికంగా క్రుంగెలా చేస్తుంది అలాంటి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో రకాలా చర్యలను తీసుకుంటుంది. అంతేకాకుండా ఇవాళ మరో కొత్త ఆలోచనాలకు తెరతీసింది. 

 

 

 

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనతా కర్ఫ్యూ విజయవంతంగా అమలులోకి వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ కర్ఫ్యూను మరి కొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ప్రాణాంతకర వ్యాధి పేరు వింటేనే భయంతో పారిపోతుంటే ఓ తెలుగు డాక్టరు మాత్రం ముందడుగు వేసాడు. 

 

 


ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టిన వుహాన్‌కు వెళ్లడమంటేనే డేంజర్‌ జోన్‌లోకి అడుగుపెట్టినట్టుగా అందరూ భావిస్తుంటే ఆ డాక్టర్‌ అక్కడి బాధితులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు చైనాలోని వుహాన్‌కు వెళ్లి వైరస్‌ రోగులకు వైద్య సేవలందించి తన ఔదార్యం చాటుకున్నారు. వాషింగ్టన్‌ డీసీలో నివసించే తెలుగు వ్యక్తి డాక్టర్‌ నాగరాజు చైనాలోని వుహాన్‌కు వెళ్లి కరోనా రోగులకు వైద్య సేవలందించారని, ఆయన తన బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన అనంతరం చైనీయులు ఆయనను ప్రత్యేక విమానంలో సాగనంపారని ట్వీట్ చేశారు.. ఆ ధైర్యాన్ని మెచ్చుకొని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: