ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. చైనా దేశం వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటలీలో ఈ వైరస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఏడుస్తూ శవాలను పార్టీ పెట్టడానికి స్థలాలు కూడా లేవని ఎవరూ కూడా రావడం లేదని బాధపడిపోతూ మీడియా ముందే కన్నీటిపర్యంతమై బోరున ఏడ్చాడు. భారత దేశంలో కూడా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. మార్చి 22 నుండి 31 వరకు జరగనున్న ఈ కర్ఫ్యూ లో ఎవరూ కూడా దేశ ప్రజలు బయటకు రాకూడదు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ పాటించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చైనా లో పుట్టిన ఈ వైరస్ విషయంలో ఒక విషయం బయట పెడితే ప్రపంచమంతా సేఫ్ అయ్యే పరిస్థితి ఉందని ఒక వార్త ఇటీవల వినబడింది. అదేమిటంటే ఆ దేశ మొబైల్ నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చైనా ఆ దేశంలో కరోనా వైరస్ వలన సంభవించిన మరణాలు దాస్తునట్లు స్పష్టత వస్తుంది.

 

చైనాలో జనవరికి ముందు కొత్త కనెక్షన్స్ పెరిగితే జనవరి-మార్చి మధ్య మాత్రం ఏకంగా కోటి 50 లక్షల ఫోన్ నంబర్లు పనిచేయడం మానేశాయని, ఒక్కో ఫోన్ లో 2 సిమ్ కార్డులు ఉన్నా 75 లక్షల ఫోన్లు వాడటం మానేశారన్నమాట. అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని..? ఎందుకు ఫోన్ వాడటం లేదని, అసలు బతికే ఉన్నారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్న ఈ విషయంలో చైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ ప్రపంచస్థాయిలో చాలామంది నాయకులు కోరుతున్నారు. వైరస్ వల్ల చైనా చెప్పిన మూడు వేల సంఖ్య కంటే ఎక్కువ లక్షలలో మరణాలు ఉన్నాయని నమ్మాల్సి ఉంటుంది అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టత ఇస్తే ప్రపంచ దేశాలు జాగ్రత్త పడతాయని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: