ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు లాక్ డౌన్ అంటే ఏమిటి...? లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. లాక్ డౌన్ అంటే 1897 చట్టం ప్రకారం మొదట అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిపివేయబడతాయి. పాలు, కూరగాయలు, అత్యవసరం అయిన వాటికి మాత్రమే అనుమతి ఉంటుంది. 
 
లాక్ డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి తిరగకూడదు. ఫంక్షన్లు, విహారయాత్రలు, జనం గుంపులుగా చేరే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. జనం ఒకే ప్రదేశంలో గుంపులు గుంపులుగా ఉండకూడదు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల పాటు ఇంటికే పరిమితమవ్వాలి. ప్రజలకు నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 
10 సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటికే పరిమితమవ్వాలి. దేవాలయాలు, మసీదులు, చర్చీలు కూడా మూసివేయబడతాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు కొన్ని పనులు మాత్రం చేయవచ్చు. ప్రజలు ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. నచ్చిన వస్తువులను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. 
 
అత్యవసరం అయితే టికెట్ ఉన్నవారు డొమెస్టిక్ ఫ్లెయిట్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. ప్రజలకు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి. అత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి ఒక్కరే బయటకు వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఇతరులకు రెండు లేదా మూడు మీటర్ల దూరం ఉండాలి. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి సీఎం జగన్, కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించాలా..? వద్దా...? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: