అవును కరోనా చావు కంటే కుక్క చావు అన్ని విధాలుగా నయం. ఈ మాట అక్షర సత్యం. కరోనాతో చావడం కంటే రోడ్డు మీద కుక్కలా చావడమే చాలా మంచిది అనే అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆ స్థాయిలో కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. కరోనా పేరు వింటే చాలు జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటలీ లో ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మూడు వేల మంది వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

ఇప్పుడు చనిపోయిన వారిని తీసుకు వెళ్ళే అవకాశం కనపడటం లేదు. వేలాది మందిని ఎక్కడ ఖననం చెయ్యాలో కూడా ప్రభుత్వాలకు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అసలు చనిపోయిన వారిని తీసుకువెళ్ళే౦దుకు గాను కుటుంబ సభ్యులు కూడా ముందుకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. బంధువులు అయితే వ్యాధి సోకిన వ్యక్తిని చూడటానికి ప్రాణ భయంతో ఆస్పత్రికి వచ్చే సాహస౦ చేయడం లేదు. ఇప్పుడు ఇటలీలో శవం గుట్టలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాటిని తీయడం లేదు. వాళ్ళు అవసరమైతే విధుల నుంచి తప్పుకోవడానికి రెడీ గా ఉన్నారు. 

 

అంతే గాని ముందుకి వచ్చి తీయడానికి ధైర్యం చేయడం లేదు. దీనితో ఇప్పుడు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి అనే పరిస్థితి అర్ధం అవుతుంది. కుక్క చస్తే మున్సిపాలిటి వాళ్ళు అయినా సరే పక్కకు లాగడానికి ప్రయత్నం చేస్తారు. కాని ఈ చావులో ఎవరూ కూడా మనను కనీసం పట్టుకునే పరిస్థితి లేదు. అంటుకుంటే వాళ్లకు ఎక్కడ కరోనా వస్తుందో అనే భయం అందరిలోనూ నెలకొంది. ఆ విధంగా కరోనా వైరస్ అందరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: